ఆశ .. భయం .. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’

రవితేజతో సినిమా ఎనౌన్స్ చేసినప్పుడే, ఆ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ తో పవన్ కళ్యాణ్ సినిమా అంటే నమ్మలేదు. పూరి జగన్నాథ్ రెండు సినిమాలు ఒకేసారి ఎలా పని చేస్తాడు అని డౌట్ వచ్చింది. రవితేజ సినిమా షూటింగ్ చేస్తాడా? పవన్ కళ్యాణ్ సినిమా స్టోరి వ్రాస్తాడా అని అనుమానం వచ్చింది.

పూరి జగన్నాథ్ టైటిల్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఎనౌన్స్ చేసాక కూడా నమ్మ బుద్ది కాలేదు. వెటకారం టైపులో లోగో చూసి, ఇదేదో వెటకారపు సినిమా, పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఎందుకు చేసున్నాడు అనే బాద కల్గింది.

గబ్బర్ సింగ్ విజయోనందోత్సావాలలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ తో సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం, పూరి జగన్నాథ్-రవి తేజ ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా రిలీజ్ అవ్వడం జరిగి పోయాయి.. ‘దేవుడు చేసిన మనుషులు’ లో పూరి జగన్నాథ్ చూపించిన వెటకారం చూసి, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాపై భయందోళనలు మొదలయ్యాయి.

లోగోలో మార్పులు(సిరియస్ నెస్), వర్కింగ్ స్టిల్స్, పవన్ కళ్యాణ్ గెటప్ చూసాక .. పూరి జగన్నాథ్ ఒళ్ళు దగ్గర పెట్టుకునే చేసాడన్న ఆశలు చిగురించాయి.

ప్రోమో సాంగ్స్ విన్నాక, మళ్లీ భయం .. అనుమానం.

ఫుల్ సాంగ్స్ .. సాంగ్స్ విజువల్స్ చూసాకా. ఆశలు పెరిగాయి. మణిశర్మ ఫాంలో లేకపోయినా పవన్ కెరీర్ లో బెస్ట్ మాస్ సాంగ్స్ ఇచ్చాడు.

థియేటర్ ట్రైలర్ చూసాక:
స్టిల్స్ కేక.
సాంగ్స్ కెవ్వు కేక. సాంగ్స్ విజువల్స్ టూ గుడ్. అంత తక్కువ సమయంలో అలా తీయ్యడం నిజంగా గ్రేట్.
ట్రైలర్ కుమ్మేసింది.

అన్నీ పాజిటివ్ గా వున్నా ఆశ .. భయం .. రెండూ వెంటాడుతూనే వున్నాయి. ఒక పక్క ‘గబ్బర్ సింగ్’ ను మించి హిట్ అవ్వాలని ఆశ. ఇంకో పక్క ‘కొమరం పులి’ మాదిరి మెసేజ్ ఓవర్ డోస్ అయిపోతుందేమోనని భయం.

ఇంకో రెండు వారాలు ఆగక తప్పదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.