‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ నిర్మాతల కష్టాలు

సినిమా క్రేజ్ కు కారణం హిరో. హిరోను బట్టే సినిమా బిజినెస్ జరుగుతాది. హిరోనే సేల్ పాయింట్. క్రేజ్ వున్న హిరోలు తెలుగులో చాలామంది వున్నారు. ఎవరి ప్రత్యేకత వారిది. మంచి కథతో హీరోలను సంప్రదిస్తే దర్శకుడిని ఓకే చేస్తారు.

క్రేజ్ వున్న హిరో లేకపోతే దర్శకుడికి అంత వాల్యు వుండదు. BUT సినిమా కష్టం అంతా దర్శకుడిది. దర్శకుడే కథా రచయిత. హీరోకు ఎంత క్రేజ్ వున్నా, ఆ క్రేజ్ ను కరెక్ట్ గా వాడుకోవలసిన బాద్యత దర్శకుడిదే.

కథను, దర్శకుడిని హీరోనే ఫైనలైజ్ చేస్తే, ఇక నిర్మాత పనేంటి? నిర్మాత ప్రత్యేకత ఏమిటి?

హీరోకు పదిహేను కోట్లు. దర్శకుడికి పది కోట్లు. రెమ్యునరేషన్ ఇచ్చి ..
సినిమా నిర్మాణానికి కావలసినివి సమకూర్చి …
మంచి థియేటర్స్ లో రిలీజ్ చేసి ..
మంచి హైప్ చేసి ..
తన కష్టాన్నంతా బయ్యర్లపై రుద్దేయడమే.

బయ్యర్లు.. దర్శకుడిని, హిరో క్రేజ్ ను నమ్ముకొని అంతా దేవుడిపై భారం వెయ్యడమే. హిట్ అయ్యి డబ్బులు వస్తే ఓకే. లేకపోతే .. డబ్బులు దూల తీర్చుకొని.. తనను తాను తిట్టుకొని .. పదిమంది చేత తిట్టించుకొని .. ఇంట్లోంచి బయటకు రావడం మానేయ్యడమే.

‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ నిర్మాతల కష్టాలు:
‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాను హై ప్రైస్ కు బయ్యర్లకు అమ్మేసినా. హిరో దర్శకులకు మరీ ఎక్కువ రెమ్యునరేషన్ కమిట్ అవ్వడం వలన, నిర్మాతలకు ఫైనాన్షియల్ కష్టాలు తప్పడం లేదంట.

నిర్మాతల ఫైనాన్షియల్ కష్టాలు చూడలేక, స్పాట్ లో పవన్ కళ్యాణ్ ముందుగా అనుకున్న రెమ్యునరేషన్ కు 1/3 తగ్గించి, 2/౩ మాత్రమే తీసుకున్నాడంట.

ఈ కష్ట నష్టాలు మాకెందుకు? ప్రోపర్ పబ్లిసిటితో అనుకున్న టైంకు సినిమా రిలీజ్ చెయ్యాలని అభిమానులు కోరుకుంటున్నారు. రెమ్యునరేషన్ విషయంలో దర్శకుడికి నిర్మాతకు చెడటం.. అది సినిమా పబ్లిసిటిపై ప్రభావం చూపించడం అభిమానులకు నచ్చడం లేదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.