‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ తో పోటి పడనున్న డమరుకం

కెమెరా మేన్ గంగతో రాంబాబు: అక్టోబర్ 18

డమరుకం: అక్టోబర్ 19

ఈ డేట్స్ కే ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతాయా? అంటే సమాధానం చెప్పడం కష్టం. ఒక రోజు గ్యాప్ లో తమ సినిమాలు రిలీజ్ చేసి ఒకరి కలక్షన్స్ మరొకరు పంచుకోవడం వ్యాపారస్తులు చేస్తారను కోవడం లేదు. అక్టోబర్ 13 నుంచి దసరా సెలవులు కాబట్టి, రిలీజ్ చేసినా చెయ్యవచ్చు.

మహేష్ బాబు ‘ఖలేజ’ .. ఎన్.టి.ఆర్ ‘బృందావనం’ .. ఒకే రోజు రిలీజ్ అని అభిమానులను రెచ్చగొట్టి .. చివరికి బృందావనం ఒక వారం వాయిదా వేసారు.

మెగా సినిమాలు ‘బిగ్ బాస్’ రిలీజ్ రోజు ‘పెదరాయుడు’ రిలీజ్ ఇండ స్ట్రి హిట్ సాధించగా, ‘మృగరాజు’ రిలీజ్ అయిన రోజు ‘నరసింహ నాయుడు’ రిలీజ్ సంచలనం సృష్టించింది. అదే తరహాలో డమరుకం కూడా ఇండ స్ట్రి హిట్ అవ్వడం ఖాయం అని ఒక వర్గం తెలుగుసినిమా ప్రేక్షకులు అంటున్నారు. నాగ్ కు అంత సీను లేదని మరో వర్గం తెలుగుసినిమా ప్రేక్షకులు అంటున్నారు.

ఒకప్పుడు తక్కువ సినిమాలు చెయ్యడంలో పోటిపడిన పెద్ద హిరోలందరూ పోటి పడి ఎక్కువ సినిమా లలో నటించడం బాగుంది.ఇలా రిలీజ్ డేట్స్ కోసం కొట్టుకోవడం ఇంకా బాగుంది.

ఈ పోటి ముందే పసి గట్టి సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే పూరి జగన్నాథ్ తన సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు అదే ట్రెండ్ ను దిల్ రాజు ఫాలో అవుతూ రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా ఏప్రిల్ 5 అని ఎనౌన్స్ చెయ్యడం విశేషం.

2013 సంక్రాంతి సీజన్ లో కూడా పెద్ద హిరో సినిమాల మధ్య మంచి పోటి వుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.