‘బిజినెస్ మెన్’ రేంజ్ లో వుండే సినిమా అయితే చాలు

ఇంచుమించు ప్రతి పవన్ కల్యాణ్ సినిమా పెద్ద హిట్(నాతో పాటు అందరికీ నచ్చడం) అవుతుందని ఆశ వుంటుంది. ఆశతో పాటు కొన్ని అనుమానాలు కూడా వుంటాయి. అలానే ఈ సినిమా కూడా ‘గబ్బర్ సింగ్’ అంత పెద్ద హిట్ అవ్వాలని ఆశ, ‘పంజా’, ‘కొమరం పులి’ సినిమాల్లా ఆశలు నీరు గారుస్తుందెమోనని భయం వున్నాయి.

ఆశ, భయం పక్కన పెట్టి అసలు ఈ సినిమాపై అంచనాలు ఏమిటని చెప్పవలసి వస్తే:
1) గబ్బర్ సింగ్ అంత హిట్ కష్టం అనిపిస్తుంది. గబ్బర్ సింగ్ రిపీట్ ఆడియెన్స్ ఎక్కువ. No way CMGR can reach GS.
2) ‘బిజినెస్ మెన్’ లా సిరియస్ మూడ్ లో సాగే కథ. ఈ రేంజ్ లోనే వుండే సినిమా అయితే చాలు అనిపిస్తుంది.
3) ఫైట్స్ పెద్దగా ఎక్సపెట్ చెయ్యడం లెదు. ప్రత్యేకత ఏమి వుండదు. పూరి ఫైట్స్ లో హిరో చేంజ్ అంతే.
4) పాటలు. వీటి మీద చాలా హై ఎక్సపెటేషన్స్ వున్నాయి. ఫస్ట్ టైం ఒక్క క్లాస్ సాంగ్ కూడా లేకుండా పవన్ కల్యాణ్ చేసున్న సినిమా ఇది. బాలకృష్ణ సాంగ్స్ లా అన్నీ మాస్ సాంగ్సే. బాలకృష్ణ ఫార్ములాను మొన్న రాం చరణ్ రచ్చతో , ఇప్పుడు పవన్ కల్యాణ్ ‘కెమెరమెన్ గంగతో రాంబాబు’ తొ ఫాలో అవుతున్నారు.. మాస్, ఫ్యాన్స్ తో పాటు క్లాస్ ను కూడా ఆకట్టుకునే విధంగా వుంటాయని ఆశీస్తున్నాను.

5)రొటీన్ డైలాగ్స్. BUT సౌండ్ మాత్రమే కాకుండా ఎమోషన్ కూడా వున్నట్టు వుంది. ఎంత వరకు పండుతాయో చూడాలి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.