వై.యస్ జగన్ గురుంచి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ లో ప్రస్తావించ లేదు – పూరి జగన్నాథ్

పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రి రిలీజ్ పబ్లిసిటిలో పాల్గోనడు. కారణం “నేను ఇరగదిసేసాను .. సినిమా సూపర్ వచ్చింది .. సినిమా ఇరగదిసేస్తాది” అని చెప్పడం ఇష్టం లేక. దర్శక నిర్మాతల బలవంతంపై జల్సా సినిమా నుంచి ఆడియో ఫంక్షన్ కు ఒప్పుకుంటున్నాడు. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఆడియో ఫంక్షన్ జరగవలసిన సమయంలో రెమ్యునరేషన్ గొడవలు వచ్చి ఆడియో ఫంక్షన్ లేకుండానే, ఆడియో డైరక్ట్ గా మార్కెట్ లోకి వచ్చేసింది.

అలా అని పోస్ట్ రిలీజ్ పబ్లిసిటి కైనా పవన్ కళ్యాణ్ వస్తాడా అంటే లేదు. “సినిమా జనాలకు అర్ధం అయ్యి .. నచ్చితే ఆడుతుంది .. మనం చెప్పినంత మాత్రాన జనాలు చూస్తారా” అని రాడు. ప్రత్యేకంగా దర్శకుడితో కూర్చొని, పబ్లిసిటి ప్లాన్ చెయ్యడం కూడా జరగదు.

పవన్ కళ్యాణ్ సినిమాల పబ్లిసిటి ఆ సినిమా నిర్మాత ఇంటరెస్ట్ లేదా ఆ సినిమాకు పనిచేసిన దర్శకుడు దయపై ఆధారపడి వుంది.

పాటలు సూపర్ హిట్. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్ మాస్ అల్భం. ట్రైలర్స్ లో పవన్ స్టెప్స్ ఇరగదిసేసాడు. విజువల్స్ అదిరిపోయాయి. పవన కళ్యాణ్ గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ కావడం మూలాన అభిమానులతో పాటు అందరూ ఎదురు చూస్తున్నారు.

మీడియా, రాజకీయాలకు సంబంధించిన చిత్రం కావడంతో మేధావి ప్రేక్షక వర్గంతో పాటు ఇటు మీడియా కూడా బాగా ఎదురుచూస్తుంది. భారీ కలక్షన్స్ సాధించడానికి 18వ తేదిన భారీ రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి.

దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమా పబ్లిసిటి బాద్యత తీసుకొని కష్టపడుతున్నాడు.

పబ్లిసిటిలో భాగంగా పూరి జగన్నాథ్ సాక్షి ఛానల్లో మాట్లాడుతూ: ఈ సినిమా రాజకీయాలు మీడియా గురుంచి వుంటుంది తప్ప, రాజకీయ నాయకుల గురుంచి వుండదు అన్నాడు.

అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న జగన్ పై కాని, చెత్త కాంగ్రెస్ తో కుమ్మక్కైన చిరంజీవిపై గాని సెటైర్లు లేనట్టే. రాజకీయ నాయకులను విమర్శించకుండా(సినిమా పెద్దలు రాజకీయ పెద్దలను విమర్శించకుండా), ఆ పాపమంతా(ప్రస్తుత రాష్ట్ర దుస్థితి) తెలివిగా ప్రజలపైనే నేట్టేసారన్న మాట.

ప్రస్తుత రాష్ట్ర హీన దుస్థితికి కారకులు ఎవరు? ఎవరు మారాలి? నాయకులు మారాలా? ప్రజలు మారాలా? ఎవరు మారతారు? అనే ప్రశ్నలకు ఒక్కొక్కరిది ఒక్కొక అభిప్రాయం. అభిప్రాయాలు ఏకం కాకపోయినా, తప్పంతా ప్రజలపై నేట్టేసినా, అందరిని(నాయకులు, మీడియా & ప్రజలు) ఆలోచింపజేసే చిత్రం చేసిన పూరి & పవన్ అభినందనీయులు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.