సినిమాలో అభ్యంతకర సీన్లు, డైలాగ్లు ఏమి వున్నాయి?

“ఒత్తిడి తట్టుకొలేక మా రాజకీయ నాయకులకు ‘బొల్లి’ కూడా వచ్చేస్తుంది..” – చంద్రబాబు కు బొల్లి వుండటం వలన ఆ డైలాగ్ తప్ప, మిగతా సీన్లు కాని, డైలాగ్స్ కాని ఎవరినీ ఉద్దేశించి వ్రాసినట్టుగా అనిపించలేదు. ఈ విషయంలో తెలుగుదేశం వాళ్ళు గొడవ చెయ్యడంలో ఒక్క అర్ధం వుంది, వాళ్ళు సినిమాకు నెగెటివ్ గా పబ్లిసిటి చేసినా తప్పు లేదు. కాని తెలంగాణ వాదులు భుజాలు తడుముకోవడం ఏమిటో ఎంత ఆలోచించినా అంతు చిక్కడం లేదు.

1) మన దేశంలో ప్రస్తుత రాజకీయ నాయకులు(90%) తెరముందు ఎలా బిహేవ్ చేస్తారో, తెర వెనుక ఎలా ఆలో చేస్తారో చాలా నిజాయితీగా చెప్పాడు. కోట or ప్రకాష్ రాజ్ మన అభిమాన రాజకీయ నాయకుడులా అనిపిస్తే అది పూరి తప్పు కాదు, అది మన తప్పు, మన నాయకుడి తప్పు. Nothing Wrong from Puri Jagannadh and he didn’t point any particular politician.

2) మీడియా ఒక వార్తను సెన్సేషన్ చెయ్యడానికి ఏమి చేస్తారో చూపించాడు. హాద్దులు లేకుండా న్యూస్ క్రియేట్ చేసినోడిని దరిద్రుడా అని తిట్టాడు. అలా తీస్తే కాని వెధవలు చూడరని టి.వి ప్రేక్షకులని తిట్టాడు. All True.

3) అమ్మాయిలు తమకు తాము ఎలా extra-ordinary అనుకుంటారో చెప్పాడు. అబ్బాయిలు ordinaryగా వుంటేనే ఇష్టపడతారు అని చెప్పాడు. All True.

4) పని పాట చెయ్యకుండా సోల్లు చెప్పుకునే వాళ్ళను తిట్టాడు. All True.

సినిమాలో అభ్యంతకర సీన్లు, డైలాగ్లు ఏమి వున్నాయి?

పవన్ కళ్యాణ్ బయటకు రావాలి:

ప్రజా ఉద్యమాలను, ప్రజా ఉద్యమ నాయకులను ఏమైనా అంటే తప్పు. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో ఎక్కడా కూడా వాటిని విమర్శించలేదు.

తెలుగు అనే ఉద్యమం క్రియేట్ చేసి, ఆ ఉద్యమం అడ్డు పెట్టుకొని నాటకాలు ఆడుతూ ప్రజలను రెచ్చగొట్టే ఒక రాజకీయ నాయకుడును చూపిస్తే తెలంగాణ ఉద్యమంకు రిలేట్ చెయ్యడం ఎంత వరకు సమంజసం?

ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేసి, లబ్ది పొందాలనుకునే నాయకులు పెరిగిపోతున్నారు. ఏది తప్పు, ఏది ఒప్పు తెలుసుకొని స్పందించండని ప్రజలను చైతన్యవంతులను చేద్దామనే మంచి ఉద్దేశంతో తీసిన సినిమాపై కూడా దాడులు జరుగుతున్నాయంటే మనం ఎటు పయనిస్తున్నాం?

కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో ఉద్యమం పేరుతొ సాటి మనుషులను ఇష్టమొచ్చిన పదజాలంతో విర్ర వీగుతున్న రాజకీయ నాయకులను ప్రశ్నించాడు తప్ప, ఏ ఉద్యమాన్ని కించపరిచినట్టుగా అనిపించలేదు..

ఇప్పుడు అటువంటి రాజకీయ నాయకులే పేట్రేగి పోయి ప్రజలను రెచ్చ గొడుతుంటే మౌనంగా వుండటంలో అర్ధం లేదు. పవన్ కళ్యాణ్ బయటకు రావాలి. దాడులను ప్రేరేపిస్తున్న నాయకులకు, ఆ నాయకుల మాటలకు లొంగిపోయి బౌతికదాడులు చేస్తున్న వాళ్ళను ప్రశ్నించాలి.

నిజాయితీగా చేసిన ప్రయత్నం

కెమెరామెన్ గంగతో రాంబాబు ఒక సీరియస్ ఫిలిం. నీచ రాజకీయ నాయకులు వలన ప్రస్తుతం మన రాష్ట్రం ఎదుర్కోంటున్నసమస్యలను మన తెలుగు ప్రేక్షకులలో మెజారిటి ప్రేక్షకులైన మాస్ ప్రేక్షకులను రీచ్ అవ్వడానికి నిజాయితీగా చేసిన ప్రయత్నం.

నేను భయపడినట్టుగా తప్పంతా పూర్తిగా ప్రజలపై నెట్టేయకుండా,

1) తప్పును ప్రోత్సహించడమే కాదు, తప్పును ఒప్పుగా వాదించే ప్రజలను
2) ఉద్యమాల పేరుతో ఎంతటి నీచానికైనా దిగజారే రాజకీయనాయకులను
3) రాజకీయల కోసం మీడియా నడుపుతున్న రాజకీయనాయకులను
4) మీడియా ఎంత పవర్ ఫుల్లో చెపుతూ, తప్పుడు వార్తలను వెటకారంగా ప్రసారం చేసే మీడియాను తిడుతూ

ఎక్కడా లైను క్రాస్ చెయ్యకుండా పూరి జగన్నాథ్ బాగా తీసాడు.

‘బిజినెస్ మెన్’ నాకు నచ్చింది. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ కూడా అలానే అనిపించింది. ‘బిజినెస్ మెన్’ హిరో క్యారెక్టరైజేషన్ నెగిటివ్ గా అనిపిస్తుంది, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ పాజిటివ్ గా అనిపిస్తుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.