త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ సినిమాలో చిరంజీవి సాంగ్ రీమిక్స్

పాత సినిమా పాటలు తన సినిమాలో రీమిక్స్ చేసి చెయ్యడం పవన్ కళ్యాణ్ కు కొత్త కాదు. ఖుషి సినిమాలో ‘ఆడువారి మాటలకు అర్దాలే వేరులే’ అని చేసాడు. అలానే జాని సినిమాలో ‘ఈ రేయి’ అనే పాట చేసాడు.

రామ్ చరణ్ తన సినిమాలలో చిరంజీవి హిట్ సాంగ్స్ ను రీమిక్స్ చేసి చిరంజీవిని గుర్తు చేస్తున్నాడు, చిరంజీవి అభిమానులను అలరిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తన సినిమాలలో చిరంజీవిని ఎదో ఒకే సీనులో చూపించడం తప్ప, ఫుల్ లెంగ్త్ సాంగ్ చెయ్యలేదు.

మెగా అభిమానిగా చిరంజీవి ఫుల్ సాంగ్ లో రామ్ చరణ్ ను చూసినట్టుగా పవన్ కళ్యాణ్ ను చూడాలని ఆశ. ఆ ఆశ త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ సినిమాలో తీరితే బాగుండును. ‘కొండవీటి దొంగ’ లో చమక్ చమక్ సాంగ్ పవన్ కళ్యాణ్ చేస్తే ఇంకా సూపర్.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.