అల్లు అర్జున్ సినిమాల రిలీజ్ డేట్ ఇబ్బందులు

డిసెంబర్ 15 కి ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా ఫస్ట్ కాపీ నిర్మాత చేతిలో పెడతా. ఇక రిలీజ్ ఆయన ఇష్టం. – దర్శకుడు పూరి జగన్నాథ్

ఒకప్పుడు సంవత్సరానికి ఒక మెగా సినిమా వస్తే గొప్ప అన్నట్టు వుండేది. కాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంవత్సరానికి రెండు సినిమాలు ఇస్తుంటే, రామ్ చరణ్ కూడా అదే బాటలో రెండు సినిమాలు ఇవ్వడానికి కష్టపడుతూనే వున్నాడు.

కాని మనకున్నవి నాలుగే సినిమా రిలిజ్ సీజన్స్. 1) సంక్రాంతి(జనవరి) 2) సమ్మర్(ఏప్రిల్/మే) 3) జూలై 4) దసరా.

ఈ నాలుగు సీజన్స్ కూడా పవన్ కల్యాణో రామ్ చరణో ఆక్రమించేయడం వలన అల్లు అర్జున్ కు ఇబ్బందులు తప్పడం లేదు.

జనవరి లో రామ్ చరణ్ ‘నాయక్’ , సమ్మర్ లో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమా & రామ్ చరణ్ ‘ఎవడు’ రిలీజ్ కు సిద్దం అవుతున్నాయి. ఇంచు మించు అదే టైంకు రెడీ అవబోతున్న అల్లు అర్జున్ నెక్స్ట్ రెండు పూరి జగన్నాథ్ ‘ఇద్దరమ్మాయిలతో’ & సురేందర్ రెడ్డి ‘రేస్ గుర్రం’ సినిమాలు ఏ టైమ్లో రిలీజ్ అవుతాయనేది ఇంటరెస్టింగ్.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.