బ్రాహ్మణులకు బ్రాహ్మణులే శత్రువులు

దేనికైనా రె’ఢీ’ సినిమాలో ఏవైనా అభ్యంతరకర సన్నివేశాలు వుంటే దానికి ముందుగా బాద్యత వహించవలసిన వ్యక్తులు సినిమా ‘రచయితలు’. ఈ సినిమాకు పనిచేసిన రచయితలిద్దరూ ‘కోన వెంకట్’ , ‘బి.వి.యస్. రవి’ & మాటల రచయిత ‘మధుకూరిరాజా’ .. అందరూ బ్రాహ్మణులే అంట.

దీనిని బట్టి నాకు అర్ధం అయ్యిందేమిటంటే బ్రాహ్మణులకు బ్రాహ్మణులే శత్రువులు. So దేనికైనా రె’ఢీ’ సినిమా సన్నివేశాలు విషయంలో మోహన్ బాబును ఆడిపోసుకోవడం తప్పు.

నోరు జారిన మోహన్ బాబు: సినిమాపై ఎవరికైనా అభ్యంతరాలు వుంటే, సమస్యను సామరాస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా నోరు జారడం తప్పు. ఫ్రీ పబ్లిసిటి వస్తుంది కదాని నోరు జారి పీకల మీదకు తెచ్చుకున్నట్టుగా వుంది.

యువ బ్రాహ్మణులు మోహన్ బాబు ఇంటి పైకి వెళ్ళడం తప్పు: ధర్నా కోసం పోలీసులకు చెప్పకుండా(పర్మిషన్ లేకుండా) మా అమెరికాలో ఎవరి ఇంటి మీద కైనా వెళితే కాల్చి దొబ్బుతారు. కేసు కూడా వుండదు. మోహన్ బాబు మనుషులు దెబ్బలతో సరిపెట్టారు. ఇక్కడ దెబ్బలతో పోయింది.

ఎవరిది తప్పు .. ఎవరిది ఒప్పు .. చూసే కోణాన్ని బట్టి వుంటుంది కాబట్టి. మీరు నాతొ ఏకీ భవించవలసిన అవసరం లేదు.

సినిమాలో నిజంగా వివాదాస్పదమైన సన్నివేశాలు ఉన్నాయా?
ఇది కూడా just ఒక అభిప్రాయమే. మీరు నాతొ ఏకీ భవించవలసిన అవసరం లేదు. ఇది చదువుతున్నారంటే, మీరు పిచ్చ ఖాళీగా వున్నారని అర్ధం. చాలా సెన్సిటివ్ మేటర్ కాబట్టి ఇక్కడ చదివి ఇక్కడే మర్చిపోండి.

పాయింట్ 1) రచయితలు .. దర్శకుడు .. నిర్మాత .. ఉద్దేశ పూర్వకంగా బ్రాహ్మణులను కించ పరుద్దామని తీసిన సినిమా కాదు.

పాయింట్ 2) వేరే చాలా సినిమాలలో వున్నట్టుగానే ఈ సినిమాలో కూడా కామెడీ కోసం ఓవర్ బోర్డ్ అయిన సన్నివేశాలు వున్నాయి. బ్రాహ్మణులను కచ్చితంగా బాదించేవే. వారు అబ్జక్షన్ చెప్పడం సబబే.

పాయింట్ 3) రాజులందరూ(రాజులు మాత్రమే) కృష్ణంరాజును దైవంగా కోలుస్తారని చూపించడం కూడా సెన్సిటివ్ విషయమే. బ్రాహ్మణుల మాదిరి అవమానించే విధంగా లేదు కాబట్టి సరిపోయింది. better not touch in this angle.

bottomline:
నిజంగా అభ్యంతకర సన్నివేశాలు వున్నాయి ..
మేకర్స్ వారిని కించ పరచాలని తీయ్యలేదు ..
కాబట్టి ..
‘రాంబాబు’ మాదిరి వారు అడిగిన సన్నివేశాలు పెద్దల సమక్షంలో కట్ చేసేసి వుంటే సరిపోయేది ..

వివాదాల వలన సాధించేది ఏమి వుండదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.