వి.వి. వి’నాయక్’కు 11 కోట్లు

ప్రస్తుతం తెలుగుసినిమాలలో దర్శకుల పాత్ర కీలకం అయిపోయింది. కేవలం పెద్ద హిరో మాత్రమే వుంటే సినిమాపై హైప్ రావడం లేదు. మంచి దర్శకుడు తోడైతేనే ఆ సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి కలిగి తద్వారా నిర్మాతకు క్రేజీ బిజినెస్ జరుగుతుంది.

‘ఆది’ సినిమా ద్వారా యంగ్ ఎన్.టి.ఆర్ కు సూపర్ స్టార్డం క్రియేట్ చేసి, దిల్ సినిమా ద్వారా ‘దిల్ రాజు’ అనే మెగా నిర్మాతను తెలుగు సినిమా పరిశ్రమకు అందించిన భారీ మాస్ దర్శకుడు వి.వి. వి’నాయక్’ మెగాస్టార్ కు తన కెరీర్ లో టాప్ 10లో ఒకటిగా నిలిచిన ‘ఠాగూర్’ అందించాడు.

మెగాస్టార్ వారసుడిగా ‘రామ్ చరణ్’ తనకు ఒక మంచి కమర్షియల్ దర్శకుడు తోడైతే తన స్టామినా ఏమిటో ‘మగధీర’ సినిమా ద్వారా చూపించాడు. మగధీర దర్శకుడు రాజమౌళి సమకాలికుడు, ఇంచుమించు అంతే రేంజ్ వున్న దర్శకుడు వి.వి.వి’నాయక్’ తో రామ్ చరణ్ చేస్తున్న చిత్రం ‘నాయక్’ వచ్చే సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నేను విన్న న్యూస్ ఎంత నిజమో తెలియదు కాని, ఈ సినిమాకు వి.వి.వినాయక్ కు తీసుకుంటున్న రెమ్యునరేషన్ 11 కోట్లు అంట. మరో విశేషం ఏమిటంటే హిరో ‘రామ్ చరణ్'(9 కోట్లు) కంటే ఎక్కువ. వీరద్దరికే 20 కోట్లు అయితే సినిమా బడ్జెట్ ఎంత అనుకుంటున్నారా?

వి.వి.వినాయక్ – 11 కోట్లు
రామ్ చరణ్ – 9 కోట్లు
other రెమ్యునరేషన్స్ – 4 కోట్లు
సినిమా ప్రొడక్షన్ ఖర్చు – 18 కోట్లు
———————————–
టోటల్ సినిమా బడ్జెట్ – 42 కోట్లు
———————————–

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.