ఎన్.టి.ఆర్ నిర్మాతగా వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ 100వ చిత్రం

చిన్న ఛాన్స్ దొరికితే చాలు యంగ్ ఎన్.టి.ఆర్ ను నందమూరి ఫ్యామిలీ నుంచి వెలి వేసేయడానికి ఒక వర్గం బాగా ప్రయత్నం చేస్తూ వుంటుంది. కాని ఎన్.టి.ఆర్ ఎప్పుడూ నందమూరి ఫ్యామిలీకి నందమూరి అభిమానులకు దూరం కావాలని ప్రయత్నం చెయ్యలేదు. వారి విలువ తెలిసిన యంగ్ ఎన్.టి.ఆర్ దూరం చేసే ప్రయత్నం కూడా చెయ్యడు. నందమూరి వంశం రెండో తరం బాలకృష్ణ అంటే ఎన్.టి.ఆర్ కు ఎనలేని గౌరవం. బాలకృష్ణ ఫార్ములతోనే మాస్ ఇమేజ్ సంపాదించాడు.

ఇద్దరు మాస్ డైరక్టర్స్ ను తెలుగు పరిశ్రమకు అందించాడు యంగ్ ఎన్.టి.ఆర్ . వయసులో బాగా చిన్నవాడు కావడం వలన విరివిగా వారి మాటల్లో వినిపించక పోయినా తమకు లైఫ్ ఇచ్చిన ఎన్.టి.ఆర్ పై కృతజ్ఞ్జతా భావం ఆ దర్శకులకు ఎప్పటికీ వుంటుంది. రాజమౌళి అందుబాటులో లేడు. యంగ్ ఎన్.టి.ఆర్ నందమూరి అభిమానుల కోరిక మేరకు బాలకృష్ణ 100వ చిత్రానికి వి.వి.వినాయక్ ను డైరక్ట్ చెయ్యమని రిక్వెస్ట్ చేసాడంట. బాలకృష్ణ ఓకే చేస్తే, బాలకృష్ణ 100వ చిత్రానికి దర్శకుడు వి.వి.వినాయక్. యంగ్ ఎన్.టి.ఆరే నిర్మించే అవకాశం వుందం టున్నారు.

ఈ న్యూస్ నిజమైతే నందమూరి అభిమానులకు పండగే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.