ఒంటరిగా పోరాడుతున్న మోహన్ బాబు

సినిమా హిట్ చెయ్యడం కోసం, వినోదం పండించడం కోసం మేకర్స్ స్థాయి దిగజారి సీన్స్ క్రియేట్ చేసిన మాట వాస్తవమే. సినిమా చేసేటప్పుడు లైను క్రాస్ చేస్తున్నాం అని అనిపించినా, ఇంతకు ముందులానే బ్రాహ్మణులు లైట్ తీసుకుంటారులే అని కానిచ్చేసి వుంటారు. దర్శకుడు కావాలని చేసాడు అనుకుందాం అంటే ఈ సినిమాకు పనిచేసిన రచయితలందరూ బ్రాహ్మణులే.

రచయితలు, దర్శకుడు కంటే నిర్మాత మోహన్ బాబుకు ఎక్కువ పేరు వుండటం వలన ఈ సినిమాలో జరిగిన తప్పులకి బాద్యుడు అయిపోయాడు. దానికి తోడు పబ్లిసిటి వస్తుందిలే అని నోరు జారి చిక్కుల్లో పడ్డాడు.

పుండు మీద కారం చల్లినట్టు మరో పక్క శాంతి యుతంగా ధర్నా చేద్దామని ఇంటికెళ్ళిన వారిపై దాడి చేయించాడని మీడియాలో న్యూస్ వచ్చేటప్పటికి బ్రాహ్మణ వర్గానికి మరింత మండింది. మోహన్ బాబు కాంప్రమైజ్ కు వచ్చినా సినిమా పూర్తిగా బ్యాన్ చేసేదాకా వూరుకునేట్టు లేరు.

మోహన్ బాబు బ్రాహ్మణ ద్వేషా?
ఈ వివాదం ద్వారా ఇంతకు ముందు మోహన్ బాబు నటించిన మరికొన్ని సినిమాలు జోడించి బ్రాహ్మణ దోషిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. దేనికైనా రె’ఢీ’ సినిమా విషయంలో నేను మోహన్ బాబును విమర్శించ లేకపోతున్నాను.

నాకు తెలిసిన సమాజంలో బ్రహ్మణులను గౌరవించే వాళ్ళు తప్ప, ద్వేషించే వాళ్ళు ఎవరూ లేరు. మోహన్ బాబు బ్రహ్మణులను ద్వేషించే మనిషని నేననుకోను. ఏదో ఫ్లోలో రచయితలు సినిమా కథనం అలా వ్రాసేసారు కాని, బ్రాహ్మణులను కించ పరుద్దామని కాదు.

పరిష్కారం ఏమిటి?
బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పడం అవమానం కాదు. అనుకోకుండా మోహన్ బాబు వైపు నుంచి తప్పులు జరిగాయి కాబట్టి వారు డిమాండ్ చేసే సీన్స్ డిలిట్ చేసి, బ్రాహ్మణులకు మన స్పూర్తిగా క్షమాపణలు చెప్పేస్తే సరి.

మా కులంను కించపరిచారని అంతమంది స్వచ్చందంగా పోరాడుతుంటే ఎవరైనా ఈ సినిమా విషయంలో మోహన్ బాబుకు సపోర్ట్ చెయ్యడం కష్టం. ఒంటరిగా పోరాడవలసిందే. ఈ ఒంటరి పోరాటం ద్వారా మోహన్ బాబు సాధించేది ఏమి వుండదు.

బ్రాహ్మణులు సహృదయంతో తప్పులు మన్నించి పెద్దలతో చర్చలకు వచ్చి సమస్యను ముగిస్తే బావుంటుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.