రజనీ కాంత్ ‘బాషా’ స్పూర్తితో రామ్ చరణ్ ‘నాయక్’

nayak

సినిమా రంగంలో స్క్రీన్ ప్లేని సమూలంగా మార్చేసిన చిత్రం ‘బాషా’. ఆ సినిమా స్పూర్తితో చాలా సినిమాలు వచ్చాయి. పేర్లు చెప్పను కాని .. రేపు పండగకు వచ్చే సినిమాలో ఒకటి ఆ కోణంలోనే సాగుతుంది. —దాసరి నారాయణరావు.

‘నాయక్’ సినిమాలో రామ్ చరణ్ డబుల్ రోల్ అని ప్రచారం జరుగుతుంది. అదేంత ఎంత నిజమో తెలియదు కాని, రామ్ చరణ్ రెండు షేడ్స్ వున్న పాత్రలలో నటిస్తున్నాడన్నది నిజం.

1) ఒక రోల్, ప్రస్తుతం యువతకు కనెక్ట్ అయ్యేది.
2) ఇంకో రోల్, చిరంజీవి ఇమేజ్ కు రామ్ చరణ్ ఏజ్ & ఇమేజ్ జోడించి డిజైన్ చేసింది.

యాక్షన్ .. ఎంటరటైన్ మెంట్ .. సెంట్ మెంట్ .. డాన్స్ .. ఫైట్స్ లతో ఆ రెండు రోల్స్ కు కనక్షన్ ఏమిటనేదే ‘నాయక్’ సినిమా.

రేపు పండగకు వచ్చే సినిమాలో ఒకటి ‘బాషా’ స్క్రీన్ ప్లే స్పూర్తితో వస్తుందని దాసరి నారాయణరావు అన్నారు. ఆ సినిమా ‘నాయక్’ అని అభిమానులు గెస్ చేస్తున్నారు.

మొన్న విడుదలయిన ‘నాయక్’ సాంగ్స్ లో చిరంజీవి రీమిక్స్ సాంగ్ కొద్దిగా నిరుత్సాహ పరిచినా, ఓవరాల్ గా సాంగ్స్ ఇనిస్టెంట్ సూపర్ హిట్. అందులో ఒక సాంగ్ విడియో కూడా లీక్ అయ్యింది.

ఆ సాంగ్ చూసిన అభిమానులే కాదు, చూసిన వాళ్లందరూ రామ్ చరణ్ డాన్స్ కుమ్మేసాడు అంటున్నారు. తెలుగు తెరపై డాన్సస్ ప్రత్యేకత కలిగిన హీరోలు ‘యంగ్ ఎన్.టి.ఆర్’ & ‘అల్లు అర్జున్’ ధీటుగా ఒక మెట్టు పైనే రామ్ చరణ్ డాన్స్ వుందని అంటున్నారు. నిజమైన డాన్సేనా ? గ్రాఫిక్ జిమ్మిక్కా అని అవాక్కాయన వాళ్ళు కూడా వున్నారు.

విడుదలకు ముందే అభిమానులను ఇంత ఉత్సాహపరుస్తున్న నాయక్ , సినిమా విడుదల తర్వాత ఎన్ని సంచలనాలు సృష్టింస్తుందో తెలియాలంటే జనవరి 9 వరకు ఆగాల్సిందే !

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.