పవన్ కల్యాణ్ సినిమాలో మహేష్ బాబు గెస్ట్ రోల్

pawan-kalyan-mahesh-babu-ph

‘వేదం’ సినిమా వచ్చినప్పుడు చాలా కాలం తర్వాత తెలుగులో వస్తున్న మల్టీ స్టారర్ సినిమా అని ప్రచారం చేసారు. కాని ఆ సినిమా కథలో హిరోలెప్పుడూ కలవడం కాని, పోటిపడటం కాని జరుగలేదు. ప్రజలను రక్షించడానికి కలిసి ప్రాణ త్యాగం చేస్తారు. SO తెలుగు ప్రేక్షకులు మల్టీ స్టారర్ సినిమా అని ఫీల్ అవ్వలేదు.

అలానే రేపు సంక్రాంతికి రాబోతున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, 25 సంవత్సరాల తర్వాత తెలుగులో రాబోతున్న రియల్ మల్టీ స్టారర్ తెలుగు సినిమా గా ప్రచారం జరుగుతుంది.

ఒకే తరానికి చెందిన హిరోలు చేస్తే రియల్ మల్టీ స్టారర్ అవుతుంది కాని రెండు తరాలకు చెందిన వెంకటేష్, మహేష్ బాబు లు కలిసి నటిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మల్టీ స్టారర్ సినిమానే కాని రియల్ మల్టీ స్టారర్ కాదంటున్నారు కొందరు. వారి వాదనలో కూడా నిజం లేకపోలేదు. It is more of Mahesh babu movie than Venkatesh.

రియల్ మల్టీ స్టారర్ అంటే మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ ఫుల్ లెంగ్త్ మూవీలో నటించాలి. స్టోరీ .. బడ్జెట్ .. దర్శకుడు .. నిర్మాత .. హిరోల ఇగో .. అభిమానుల పనికిమాలిన గొడవలు .. so on .. అది జరిగే పని కాదు.

పవన్ కల్యాణ్ సినిమాలో మహేష్ బాబు గెస్ట్ రోల్ నటించే అవకాశం మాత్రం వుంది. అది త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మాత్రమే సాధ్యం.

‘అతడు’ ‘ఖలేజ’ సినిమాల ద్వారా నటుడిగా తనలోనే కొత్త కోణాన్ని ఆవిష్కరించిన దర్శకుడిగా త్రివిక్రమ్ పై మహేష్ బాబు కు ఎంతో గౌరవం. పవన్ కళ్యాణ్ అంటే కూడా మహేష్ బాబుకు ప్రత్యేకాభిమానం.

So, పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలో త్రివిక్రమ్, మహేష్ బాబు రేంజ్ కు తగ్గట్టు ఒక గెస్ట్ రోల్ క్రియేట్ చెయ్యగల్గితే పవన్ కల్యాణ్-మహేష్ బాబు లను ఒక్కసారే తెలుగు సినిమా స్క్రీన్ పై చూసే అదృష్టం దక్కుతుంది.

ఎటువంటి ఇగో లేకుండా మహేష్ బాబు జల్సా సినిమాకు వాయిస్ ఓవర్ అందించడం, ఎటువంటి ఇగో లేకుండా పవన్ కళ్యాన్ ఒప్పుకోవడం .. PROVES that పవన్ కల్యాణ్ సినిమాలో మహేష్ బాబు గెస్ట్ రోల్ is POSSIBLE

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.