ఇప్పుడు నచ్చాడు చంద్రబాబు

nara

చంద్రబాబు తన రెండు కళ్ళ సిద్దాంతంకు ఫుల్ స్టాఫ్ పెట్టి

“తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ రెడీ” అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ మాటకే కట్టుబడి వుండాలి. ఇంకా సమైకాంధ్రకే కట్టుబడి వున్న ఏ సీమాంధ్ర నాయకుడు అయినా ఇప్పుడే తెలుగుదేశం నుంచి విడిచిపెట్టి పోవాలి. (ఈ సిగ్గులేని నాయకులు మాటకు కట్టుబడి వుంటారా అనేది డౌటే.)

కాంగ్రెస్ రెడీ
తెలుగుదేశం రెడీ
బి.జె. పి రెడీ

అందరూ రెడీ.

ఇంకా సమైక్య వాదులు ఎవరైనా మిగిలి వుంటే కావూరి సాంబశివ రావు పార్టీకే ఓటేసి తమ బలాన్ని చూపించుకొవచ్చు.

అన్నీ పార్టీలు రెడీ కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఏర్పాటు చేసి, మా సీమాంధ్రకు విజయవాడను రాజధానిగా ప్రకటించేసేస్తే బాగుంటుంది.

విజయవాడ రాజధానిగా సీమ నాయకులకు అభ్యంతరం వుంటే, ప్రకాశం నెల్లూరు జిల్లాలను సీమ నాయకులకు ఇచ్చేసి వారికి ఇష్టం వచ్చిన సిటీని రాజదానికిగా చేసి, రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేసేయాలి.

విజయవాడ రాజధానిగా ఉత్తరాంధ్ర నాయకులు అభ్యంతరం చెపితే, వైజాగ్ రాజధానిగా ఉత్తరాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసేయాలి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.