ఓవర్ సీస్ లో అనుకున్నంత క్రేజ్ సంపాదించలేకపోతున్న ‘నాయక్’

Nayak-Ramcharan-

నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర , నెల్లూరు, కృష్ణా, వెస్ట్ & ఈ స్ట్ రీజియన్స్ కు తోడు కర్నాటాక, ఒరిస్సా, కేరళ రాష్ట్రాలలో కూడా మన తెలుగు సినిమాలకు మంచి డిమాండ్ వుంది.

వీటికి తోడు విదేశాలలో మన తెలుగు వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.మన తెలుగు వాళ్ళ సంఖ్యకు అనుగుణంగానే రిలీజ్ సెంటర్స్ (స్క్రీనింగ్ షోస్ అంటే బెటరెమో), పెద్ద హీరోల సినిమాలకు పెంచుకుంటూ పోతున్నారు. ఇక్కడో తిరకాసు వుంది. సినిమా ఏ మాత్రం తేడా వచ్చినా, సినిమాకు పెట్టిన పెట్టుబడి మాట దేవుడెరుగు, థియేటర్ రెంట్ కు సరిపడా కలక్షన్స్ కూడా రావు.

పవన్ కళ్యాణ్:
తమ్ముడు, బద్రి & ఖుషి టైంలో పవన్ కళ్యాణ్ హై లో వుండేవాడు. జానీ దెబ్బకు భారీగా డౌన్ అయ్యి. ఆ తర్వాత చాలా కాలం వరకు రైజ్ అవ్వలేదు. జల్సా సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు కావడంతో మంచి కలక్షన్స్ సాధించింది. మొన్న ‘గబ్బర్ సింగ్’ తో పూర్వ వైభవాన్ని పూర్తిగా సాధించలేకపోయినా, ఇంచుమించు బ్యాక్ టు రేస్ లోకి వచ్చాడు. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ కూడా బాగానే కలక్షన్స్ వచ్చాయి. నెక్స్ట్ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోడవ్వడంతో భారీ క్రేజ్ సంతరించుకుంది.

మహేష్ బాబు:
ప్రస్తుతం ఏ మాత్రం డౌట్ లేకుండా ‘ఓవర్ సీస్’ నెం 1 హిరో మహేష్ బాబు అని చెప్పవచ్చు. రాబోయే సినిమాల లైనప్ కూడా ‘ఓవర్ సీస్’ జనాలకు నచ్చే దర్శకులతోనే వుండటం వలన ఇదే క్రేజ్ కంటీన్యూ అయ్యే చాన్సస్ పుష్కలంగా వున్నాయి.

మహేష్ బాబు కు మరో ప్రత్యేకత కూడా వుంది (అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కూడా బాగం వుందనుకోండి). idlebrain.com jeevi రేటింగ్, రివ్యూలే ఓవర్ సీస్ కలక్షన్స్ కు కొలబద్దగా సాగుతున్న కాలంలో ‘అతడు’ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది.ఏవరేజ్ రివ్యూకు కనివిని రీతిలో కలక్షన్స్ వచ్చాయి. ఆ సినిమా తర్వాతే వచ్చిన ‘పోకిరి’, ‘అతడు’ కంటే డబుల్ కలెక్ట్ చేసి మహేష్ బాబు ను నెం 1 చేసేసాయి. సైనికుడు, అతిది నిరాశ పరిచినా ఖలేజా, దూకుడు, బిజినెస్ మెన్ సినిమాలు మళ్ళి నెం 1 స్థానానికి తీసుకొని వచ్చేసాయి.

రేపు రాబోయే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ మరియు ఫ్యామిలి మొత్తం చూడదగ్గ సినిమా అనేలా ట్రైలర్స్, మ్యూజిక్ వుండటంతో .. ఓవర్ సీస్ లో విపరీతమైన క్రేజ్ తో రిలీజ్ అవుతుంది. అంతే క్రేజ్ తో జనాలు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

చిరంజీవి: చరణ్: నాయక్:
ఓవర్ సీస్ లొ ఇంద్ర సినిమాకు ముందు పవన్ కళ్యాణ్ హవా కొనసాగింది. ఆ హావాకు తగ్గట్టుగా ఇంద్ర , ఠాగూర్, శంకర్ దాదా సినిమాలు ఆ టైమ్లో ఒక ఊపు వుపాయి. ఆ సినిమాలకు ఫ్యాన్స్ చేసిన హాడావుడి ఎప్పటికీ మరువలేనిదిగా ఇప్పటికీ చెప్పుకుంటూ వుంటారు.

చిరంజీవి తనయుడిగా చరణ్ ఓవర్ సీస్ లో చిరంజీవి హవానే కొనసాగించలేక పొయినా, మంచి క్రేజే వుంది. చిరుత బాగానే కలెక్ట్ చేసింది. మగధీర సంచనాలు సృష్టించినా ఎక్కువ భాగం రాజమౌళికే ఉపయోగపడింది. మగధీర తర్వాత వచ్చిన ఆరెంజ్, రచ్చ సినిమాలు ఓవర్ సీస్ ప్రేక్షకులను ఆకట్టు కోలేక పొవడం వలన, దాని ప్రభావం ‘నాయక్’ పై పడిందని చెప్పవచ్చు. ఓవర్ సీస్ లో అనుకున్నంత క్రేజ్ సంపాదించలేకపోతుంది ‘నాయక్’.

నాయక్ సినిమా మాస్ జెనర్ కావడం, ఇదే సమయంలో క్లాస్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రిలిజ్ వుండటం కూడా ఈ సినిమాకు కలిసి రావడం లేదని చెప్పవచ్చు.

ఓవర్ సీస్ లో సినిమా ప్రి రిలిజ్ హైప్, క్రేజ్ లేకపొయినా .. సినిమా రిలిజ్ తర్వాత కచ్చితంగా క్రేజ్ సంపాదించుకొని రికార్డ్ బ్రేక్ కలక్షన్స్ సాధించడం ఖాయమనే ధీమాతో మెగా అభిమానులు వున్నారు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.