అభిమానాన్ని పిచ్చి అనుకున్న శ్యాంప్రసాద్ రెడ్డి

SPR

ప్రభాస్ మిర్చి ఆడియో ఫంక్షన్ లో శ్యాంప్రసాద్ రెడ్డి స్పీచ్ చాలా ఆకట్టుకుంది.

అభిమానం అంటే నార్మల్ జనాలలో పిచ్చి అని అర్దం. సినిమాకు చెందిన వ్యక్తి కూడా పిచ్చి అనుకోవడం కొద్దిగా ఆశ్చర్యం కలిగించినా అభిమానం ఎలా వుంటుందో కనులకు కట్టినట్టు ఒక ప్రభాస్ అభిమాని గురించి చెప్పి యావత్ తెలుగు జనాలకు వినిపించారు. వింటున్నప్పుడు ఒళ్ళు జలదరించింది. Thanks To You Sir.

ఒక ప్రభాస్ ఫ్యాన్ గురించి ఆయన అనుభవం ఆయన మాటల్లో:

“వెస్ట్ గోదావరి జిల్లా గణపవరం అనే టౌన్ లో ఉన్న మహాలక్ష్మీ థియేటర్ ఓనర్ నాకు చాలా కావాల్సిన వ్యక్తి.ఆయన ఒక రోజు శివ అనే వ్యక్తిని నా దగ్గరికి జాబ్ నిమిత్తం పంపించాడు. అతను నన్ను కలిసి నా డబ్బింగ్ థియేటర్ లో పని చేస్తానని చెప్పాడు. ఏ .. నా ఆఫీసులో చేయవా అని అడిగాను. దబ్బింగ్ థియేటర్ లో అయితే ప్రభాస్ ని చూడొచ్చు కదా సార్ అన్నాడు. ఎందుకురా అని అడిగాను, ఆయనంటే వీరాభిమానం అని చొక్కా విప్పి చూపించాడు. అతని బాడీ మీద ప్రభాస్ నటించిన ఛత్రపతి, ఏక్ నిరంజన్, డార్లింగ్ సినిమాల పేర్లు పచ్చ బొట్టూతో రాసి వున్నాయి. ఈ చిత్ర నిర్మాతలు మిర్చి ఆడియో రిలీజ్ కు ముందు సీడీలు పంపించారు. పాటలు విన్నాక, నాతో పాటు పాటలు విన్న వాడిని ఎలా వున్నాయ్ అని అడిగాను. అన్ని పాటలు బాగున్నాయి సార్.. అన్నాడు. అలాగే ఆఫీసులో స్వీట్స్ పంచాడు. ఏంట్రా అని అడిగితే సినిమా సాంగ్స్ హిట్టు… సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అన్నాడు. ఎలా చెప్పగలవురా అని అడిగాను. ఈ డైరక్టర్ గతంలో చాలా సినిమాలకు మాటలు రాశాడు. అవన్నీ కూడా పెద్ద హిట్టయ్యాయి. ఈ సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది అన్నాడు. ఫ్యాన్స్ అభిమానం ఈ విధంగా ఉంటుందని వాడిని చూశాక అర్ధం అయ్యింది” అని అన్నారు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.