మేలో మెగా మేనల్లుడు సాయిధర్మతేజ్ సినిమా

Sai

అప్పుడెప్పుడో మెగా మేనల్లుడు సాయిధర్మతేజ్ ను హీరోగా పరిచయం చేస్తున్నాం అంటూ వై.వి.యస్ నిర్మాత & దర్శకుడిగా ‘రేయ్’ చిత్రం ప్రారంభం అయ్యింది. ఆ సినిమాకు పవన్ కల్యాణే తెర వెనుక నిర్మాత అనే పుకార్లు కూడా వినిపించాయి.

ఆ సినిమా ఏమయ్యిందో తెలియదు కాని, మొన్ననే మెగా మేనల్లుడు సాయిధర్మతేజ్ హీరోగా రెండో చిత్రం కూడా మొదలయ్యింది.అల్లు అరవింద్ గీతా అర్ట్స్ సమర్పించడం ఒక విశేషం అయితే, 100%లవ్ తో నిర్మాతగా మారిన బన్నీ బన్నీ వాసు కు పార్టనర్ గా దిల్ రాజు కలిసి ఈ సినిమాను నిర్మించడం మరో పెద్ద విశేషం.

ఎ.యస్.రవికుమార్ చౌదిరిని దర్శకుడిగా పరిచయం చేస్తున్న ఈ సినిమా, ప్లాన్ చేసినట్టుగానే మేలో వస్తుందట. పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కేర్ తీసుకునే ఈ మెగా మేనల్లుడు సాయిధర్మతేజ్ కు తెలుగు కళామ తల్లి ఎటువంటి స్థానం కలిపించనుందో తెలియాలంటే మే దాకా ఆగాల్సిందే.

సాయిధర్మతేజ్ సరసన ‘ఎస్.యమ్ .ఎస్’ & ‘రోటిన్ లవ్ స్టోరీ’ సినిమాలలో కథానాయికగా నటించిన రెజీనా నటిస్తుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.