పక్కా ప్లానింగ్ తో అల్లు శిరీష్ ‘గౌరవం’

allusirish

డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవ్వడం, యాక్టర్ల పిల్లలు యాక్టర్లు అవ్వడం సహజం. స్వర్గీయ అల్లు రామలింగయ్యగారి తనయుడిగా అల్లు అరవింద్ కమీడియన్ ప్రయత్నాలు చేసాడు, కాని చిరంజీవి విషయాలు జాగ్రత్త తీసుకోవలసిన బాద్యతలు ఎక్కువ కావడంతో కమీడియన్ గా ప్రయత్నాలు మానేసి, కాలం కలిసి రావడంతో మెగా ప్రొడ్యుసర్ గా సెటిల్ అయిపోయి, ప్రస్తుతం తెలుగు సినిమాను శాసిస్తున్న ఆ నలుగిరిలో ఒకడయ్యాడు.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వారసుడిగా అల్లు శిరీష్ పగ్గాలు పుచ్చుకొని గీతా ఆర్ట్స్ సంస్థను హాలివుడ్ స్థాయికి తీసుకొని వెళతాడనుకుంటే, పెద్ద ట్విస్ట్ ఇచ్చి ‘గౌరవం’ సినిమాతో యాక్టర్ అయిపోతున్నాడు.

అల్లు అర్జున్ నే చాలామంది మెగాఅభిమానులు దగ్గరికి రానివ్వరు. మరి అల్లు శిరీష్ ను రానిస్తారా? అందుకే ..

  1. తన ఎంట్రీని తమిళ్ సినిమాతో స్టార్ట్ చేసాడు.
  2. అల్లు శిరీష్ సోలో హిరో కాదు .. భారతదేశమే గర్వించ దగ్గ నటుడు ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రధారి.
  3. ప్రకాష్ రాజ్ నిర్మాత
  4. కచ్చితంగా సూటబల్ అండ్ మన తెలుగు తెలుగు హీరోలు వినడానికి కూడా భయపడే ఇంటరెస్టెంగ్ స్టోరి అయి వుంటుంది.
  5. ఒక మంచి తెలుగు సినిమా తెలుగు వాళ్ళు తీస్తే ఆదరించారు కాని, తమిళ్ లో నిర్మింప బడి తెలుగులో డబ్ చేస్తే తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు.
  6. సినిమా కావలసినన్ని థియేటర్స్ లో రిలీజ్ కావడానికి అల్లు అరవింద్/దిల్ రాజు సపోర్ట్ ఎలాను వుంటుంది.

bottomline:
ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురుంచి రిలీజ్ కు ముందు మాట్లాడుకుంటారు. సుడి బాగుండి హిట్ అయితే, నందమూరి వారి సహకారంతో హీరోగా నెట్టుకొస్తున్న ‘నారా రోహిత్’ తో పోటికి నిలబెట్టడానికి మెగా అభిమానులకు ‘అల్లు శిరిష్’ రూపంలో ఒక హిరో దొరికినట్టే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.