అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రాజకీయ నాయకులకు హాట్సాఫ్!

అభివృద్ధి చెందిన హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో వుంది. తెలంగాణ అసాధ్యం అనుకున్నా.

హాట్సాఫ్ టు

1) కేసిఆర్ – రాజ్యాధికారం అంటే రెండు కులాల మధ్య పోరు .. ఎప్పుడు చూసిన రెడ్లు – కమ్మొళ్ళేనా అని ప్రాంతం సెంటిమెంట్ మీద వేసుకొని కులం కంటే ప్రాంతం పవర్ ఫుల్ అని నిరూపించిన నాయకుడు

2) వైయస్సార్ – విజన్, అభివృద్ధితో దూసుకు పోతున్న చంద్రబాబును పడగొట్టడానికి ఏమైనా చెయడానికి రెడీ . ప్రత్యేక తెలంగాణకు అంగీకరించి కేసిఆర్ తో చేతులు కలిపిన నాయకుడు

3) చిరంజీవి – తెలంగాణకు ఓకే అంటే కాని, తెలంగాణలో తిరగలేని పోరాటం చేయలేని నాయకుడు ..

4) సిబియన్- చిరంజీవి కెసిఆర్ తో పొత్తు పెట్టుకుంటే మా పరిస్థితి ఏమిటని భయపడో .. వైయస్సార్ లబ్ధి దారులను ఎదుర్కొవడానికో .. కేసిఆర్ తో చేతులు కలిపిన నాయకుడు

వీరందరిని అందరిని వదిలేసి .. కేంద్ర కాంగ్రెస్ ను తిట్టడం అవివేకం .. నిర్ణయాన్ని పొడిగించకుండా ఇంతటితో ఫుల్ స్టాఫ్ పెట్టినందుకు కేంద్ర కాంగ్రెస్ ను మెచ్చుకొని, తెలంగాణ ప్రజలను ప్రశాంతంగా బ్రతకనిద్దాం ..

Lets Face it.. Build the New Capital .. కెపిటిల్ నిర్ణయాన్ని కూడా కేంద్రానికే వదిలేయడం మంచింది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.