చంద్రబాబులో వున్న కాన్ఫిడెన్స్ వేరే సీమాంధ్ర నాయకుల్లో ఎందుకు లేదు?

ఈ రాష్ట్ర విభజనలో నాకు చంద్రబాబు చాలా బాగా నచ్చాడు. మనకు(సీమాంధ్ర ప్రజలకు) ఇది ఒక పెద్ద ఛాలెంజ్.

మనం ప్రత్యేక తెలంగాణకు పార్టీలకు ఓకే అన్నప్పుడు, రాజకీయ నాయకులు వాగ్దానాలు చెయ్యడం మామూలే కదా, ఇది జరిగేనా పెట్టేనా అని కామ్ గా వున్నాం. జరిగినా హైదరాబాద్ పై మనకు సమాన హక్కులు ఇస్తారని అనుకున్నాం.

అకస్మాతుగా ఇలా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు మొదలనే ప్రకటన మనకే కాదు, తెలంగాణ ప్రజలకు కూడా పెద్ద షాక్ ఇచ్చింది.

ఇప్పుడేమి చెయ్యాలన్నది పెద్ద ప్రశ్న.

దానికి జవాబు తెలంగాణ ఏర్పాటు అడ్డుకోవడం కాదు .. హైదరాబాద్ పై మాకు హాక్కులు ఏమిటి? దానిపై వచ్చే ఆదాయంపై మా శాతం ఎంత? సీమాంధ్ర రాజధాని ఏర్పాటుకు కేంద్రం ఇచ్చే సహాయం ఎంత? అని కేంద్రాన్ని అడగాలి. సంతృప్తి చెందే వరకు పోరాడాలి.

తెలంగాణ విషయంలో మాటకు కట్టుబడిన చంద్రబాబుకు జై!

సీమాంధ్ర నాయకుల చేత తెలంగాణను ఆపించే డ్రామాలు మొదలు పెట్టనంత వరకు నా సపోర్ట్ చంద్రబాబుకే!

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.