సమైకాంధ్ర వద్దు .. సీమాంధ్ర హక్కుల కోసం పోరాడండి

ప్రత్యేక తెలంగాణ సాధించడం తెలంగాణ ప్రజల ఆకాంక్ష .. వారి ఆత్మాభిమానాన్ని, వారి మనోభావాలను గౌరవించ వలసిన బాద్యత తోటి తెలుగువారిగా మనపై వుంది ..

వారు కూడా మన సమస్యలను అర్దం చేసుకొని, ఏకాభిప్రాయానికి రావలసిన సమయం ఇది ..

తెలంగాణ సాధనకు వారు చేస్తున్న హింసాత్మక ధర్నాలను విమర్శించిన మనం, అటువంటి హింసాత్మక ధర్నాలు చెయ్యడం ఎంత వరకు కరెక్ట్?

తెలంగాణ సాధనకు వారు చేస్తున్న రాజీనామాలను డ్రామాలని విమర్శించిన మనం, అటువంటి రాజీనామాలను డ్రామాలనే చెయ్యమని మన నాయకులపై ఒత్తిడి తేవడం ఎంత వరకు కరెక్ట్?

ఇప్పుడు ఎవరికైనా కావల్సింది .. ఎవరినీ నొప్పించని పరిష్కారం ..

పరిష్కారం కావాలనుకుంటే రెండు ప్రాంతాల వారు కొన్ని త్యాగాలు చేయవలసి వుంటుంది ..

కోస్తాంధ్ర అభివృద్ధికి ఎటువంటి ఇబ్బందులు వుండవు ..
సమస్య అంతా రాయల సీమ వారికే ..

bottomline:
డ్రామా రాజీనామాలు చెయ్యడం వలన అస్సలు ఉపయోగం లేదు ..

విభజన ఆపకుండా, విభజన వలన వచ్చే సమస్యలకు పరిష్కారం కోసం వెతుకుదాం .. చర్చించుకుందాం .. రెచ్చేగొట్టే వ్యాఖ్యలు, అభద్రత కలిగించే వ్యాఖ్యలు చేయవద్దు ..

చిరంజీవి చెప్పినట్టు ‘హైదరాబాద్’ ను కామన్ కాపిటిల్ చేసి .. ఆదాయంలో ఎక్కువ భాగాన్ని తెలంగాన మరియు సీమ ప్రాంతాలకు తరలిస్తే మంచిది .. కచ్చితంగా ఇది మంచి ఆప్షన్ .. ‘హైదరాబాద్’ కు చంద్రబాబు/వైయస్సార్ పాలనలో ఉన్నటువంటి పూర్వ వైభావాన్ని తీసుకు రావొచ్చు ..

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.