సీమాంధ్రుల ఆందోళనలు కారణంగా "అత్తారింటికి దారేది" నిరవరధిక వాయిదా

pawan kalyan

రాజ్యాధికారం అంటే కులాల మధ్య పోరుగానే మిగిలిపోతుందని ప్రాంతం సెంటిమెంట్ మీద వేసుకొని కులం కంటే ప్రాంతం పవర్ ఫుల్ అని నిరూపించిన నాయకుడు కేసిఆర్.

విజన్, అభివృద్ధితో దూసుకుపోతున్న చంద్రబాబును పడగొట్టడానికి ఏమైనా చెయడానికి రెడీ . ప్రత్యేక తెలంగాణకు అంగీకరించి కేసిఆర్ తో చేతులు కలిపిన నాయకుడు వైయస్సార్.

తెలంగాణకు ఓకే అంటే కాని, తెలంగాణలో తిరగలేని పోరాటం చేయలేని నాయకుడు చిరంజీవి.

చిరంజీవి కెసిఆర్ తో పొత్తు పెట్టుకుంటే మా పరిస్థితి ఏమిటని భయపడో .. వైయస్సార్ లబ్ధిదారులను ఎదుర్కొవడానికో .. కేసిఆర్ తో చేతులు కలిపిన నాయకుడు సిబియన్.

ఎవరికి వారు గొప్ప రాజకీయం చేస్తున్నాం అనుకున్నారు తప్ప, ఈనాటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు.

కులం చూసో, డబ్బు తీసుకునో తాము సపోర్ట్ చేసే పార్టీలు ఎన్నికలకు ముందు ప్రత్యేక తెలంగాణకు ఓకే అన్నప్పుడు, రాజకీయ నాయకులు వాగ్దానాలు చెయ్యడం మామూలే కదా, ఇది జరిగేనా పెట్టేనా అని కామ్ గా వున్నారు సీమాంధ్ర ప్రజలు. జరిగినా హైదరాబాద్ పై సమాన హక్కులు ఇస్తారని అనుకున్నారు సీమాంధ్ర ప్రజలు.

“యాభై ఏడేళ్ళు రాజధాని ‘హైదరాబాద్’, ఇక నుంచి మీది కాదు” అని కేంద్రం ప్రకటించగానే సీమాంధ్ర ప్రజలకు విభజన వలన కలిగే నష్టాలు ఒక్కొకటిగా తెలుస్తున్నాయి.

కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష మధ్యలో ఆపేస్తే తెలంగాణ ప్రజలు ఎలా రోడ్డుపైకి వచ్చి ఎదురు తిరిగారో, ఇప్పుడు సీమాంధ్ర ప్రజలు సీమాంధ్ర నాయకులను నిలదీస్తున్నారు.

ఉండవల్లి లాంటి పనికిమాలిన మేధావులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఓకే అన్నప్పుడు అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు వచ్చి ఆ పార్టీ వదలకుండా సోది కబుర్లు చెపుతున్నారు.

తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు చంద్రబాబును నిలదీయకుండా తన అభిప్రాయాన్ని కచ్చితంగా చెప్పిన చిరంజీవిపై చవకబారు విమర్శలు చేస్తున్నారు.

విచిత్రం ఏమిటంటే, విభజనను ఈ సమయంలో అడ్డుకోవడం ద్వారా తెలంగాన ప్రజలను మరోసారి మోసం చెయ్యాలనుకోవడం దారుణమని ఎవరూ అనుకోవడం లేదు.

తెలంగాణ సాధించడమే లక్ష్యం అని చెప్పిన కేసిఆర్, కాంగ్రెస్ తనను డామినేట్ చేస్తుందనే భయంతో , కామ్ గా వుండ వలసిన సమయంలో ఇరు ప్రాంతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు.

bottom line:
సీమాంధ్రుల ఆందోళనలు కారణంగా “అత్తారింటికి దారేది” నిరవరధిక వాయిదా వేసారని, త్వరలోనే నిర్మాత అధికారంగా ఎదోక టెంపరెరీ డేట్ ప్రకటిస్తారని సమాచారం. అభిమానులు ఈ విషయం ముందే ఊహించారు కాబట్టి, పెద్దగా బాద పడటం లేదు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, Pawan Kalyan. Bookmark the permalink.