తెలంగాణ అంశం మళ్ళీ మొదలకు

తెలంగాణ అంశం మళ్ళీ మొదలకు రావడం ఖాయం. తాడో పేడో తేలిపోతుందనుకున్న నాలాంటి వాళ్ళకు నిరాశే.

నిజంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాడాలి అంటే, అభివృద్ధి చెందిన హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో వుంది కాబట్టి, తెలంగాణ వాళ్ళు ఎన్నో రాజీ పడాలి. సీమాంధ్ర వాళ్ళు పెట్టే అన్ని షరతులకు అంగీకరించాలి. తెలంగాన వచ్చేస్తే వాళ్ళకు మనుగడ కష్టం కాబట్టి, తెలంగాన నాయకులు దానిని తెగనివ్వరు.

సీమాంధ్ర నాయకులు పరిష్కారం కోసం మార్గం వెతకవలసింది పోయి, మూర్ఖంగా ‘సమైఖ్యాంధ్ర’ అని ప్రజలను రెచ్చగొడుతూ సాగదీస్తారు.

కేంద్రం మేము ఇవ్వడానికి రెడీ .. మేరే రెడీగా లేరు .. మరో కమిటీ వేస్తున్నాం అంటాది. what else it can do?

చూస్తూ వుండండి .. ఈ అంశం మళ్ళీ మొదలకు వస్తుంది.

ఇరు ప్రాంతల ప్రజలు, అభివృద్ది పక్కన పెట్టి, ప్రాంతం సెంటిమెంట్ తో ఆ దొంగ నాయకులనే గెలిపిస్తారు. ప్రజల నోట్లో పెద్ద రాడ్లు పెట్టడం ఖాయం.

This issue NEVER ends.

ప్రజాస్వామ్యంలో

మతం,
కులం,
ప్రాంతం,
& డబ్బు లతో ప్రజలను మోసం చేసే నాయకులదే గెలుపు.

నాయకులలో మార్పు రానిదే ప్రజలు ఏమీ చెయ్యలేరు. నాయకులు మంచి చెయ్యడానికి పోటిపడాలి, కాని 24 hours ప్రత్యర్దులను విమర్శిస్తూ కాలం గడిపేస్తున్నారు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.