ఉద్యమాలతో ప్రజలు ఏమీ సాధించలేరు ..

తెలంగాణ ప్రజలు ఎన్నో రోజులు నానా కష్టాలు పడి సకలజనుల సమ్మె చేసారు .. ఆరోజు ఏమైనా సాధించారా?

ఇప్పుడు సీమాంధ్ర ప్రజలు ఎన్ని ఉద్యమాలు చేసినా అంతే. (విడిపొతే సీమాంధ్రులకు దిక్కు లేదన్నట్టుగా అమాయక ప్రజలను తప్పు ద్రోవ పట్టించారు లుచ్చా నాయకులు)

కాంగ్రెస్ & తెలుగుదేశం జెండాలు పట్టుకొని సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసే చెత్త నాయకులు.. వాళ్లకు జైలు కొట్టే స్వార్ద మనుషులు .. ఇటువంటి వాళ్ళను కాల్చి దొబ్బాలి .. ఇటువంటి వారి వల్ల స్వచ్ఛంధంగా ఉద్యమం చేసున్న ప్రజలను కూడా అనుమానిస్తున్నారు

కాంగ్రెస్ & తెలుగుదేశం పార్టీలు చాలా స్పష్టంగా చెపుతున్నాయి .. మేము తెలంగాన ఏర్పాటుకు వ్యతిరేకం కాదు ..

అటువంటి పార్టీలలో వుండి ‘సమైక్యాంధ్ర’ అనే అర్హత ఈ లుచ్చా నాయకులకు ఎక్కడిది?

విడిపోయే ముందు ఇవి తేల్చండి అని చెపుతున్న సోది నాయకులు, ఈ ప్రశ్నలు ఆయా పార్టీలను విభజనకు ఒప్పుకున్న సమయంలో ఎందుకు అడగలేదు? ఇప్పుడు ఎవరిని మోసం చేద్దామని మైకు పట్టుకొని సోది కబుర్లు చెపుతున్నారు?.

అమాయక ప్రజలు నానా కష్టాలు పడి, ఎన్నో త్యాగాలు చేసి “విడిపోదాం” అనో “కలిసుందాం” అనో ఉద్యామాలు చేస్తే, అవేదో తామే చేసినట్టు బిల్డప్ ఇచ్చే నాయకులలో మార్పు రాదు ..

మన బ్రతుకులు వాళ్ళను తిట్టుకుంటూ బ్రతకడమే .. ఏమీ చెయ్యలేని నిస్సాహాయులం

కలిసున్నా, విడిపొయినా, ప్రజలు ఎప్పటికీ గెలవలేరు .. నాయకుల చేతిలో ఎప్పటికీ బానిసలే .. అంతిమ గెలుపు లుచ్చా నాయకులదే!

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.