ఎందుకు సమైక్యాంధ్ర ఉద్యమంను హేళన చేస్తున్నారు?

తెలంగాణ ప్రజలకు సమాధానం తెలుసు కాని .. వారు పదే పదే అడిగే ప్రశ్న:

మేము విడిపొతాం .. అంటే వెంటపడి మరీ మాతో కలిసుండండి అంటారేమిటి?

దానికి సీమాంధ్రుల జవాబు:

  1. మీ మీద మాకేదో ప్రేమ అనుకుంటే పొరబాటు.
  2. మీరు విడిపొతే మాకు నీటి సమస్యలోస్తాయి .. మీరు మాతో కలిసుండాల్సిందే!!!
  3. మాది అనుకున్న హైదరాబాద్ మీ ప్రాంతంలో వుంది .. మాది అనుకున్నది మాకు కాకుండా పొవడానికి వీలు లేదు .. మీరు మాతో కలిసుండాల్సిందే!!!

ముసుగులో గుద్దులాట లేకుండా .. ఒక అంగీకారానికి వచ్చి విడిపొతే బెటర్.

తెలంగాన ప్రజలు & ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో రోజులు ఎన్నో బంద్ లు చేసారు.

ఇప్పుడు సీమాంధ్రులు.

బ్లాగులో ఎదేదో వ్రాసేస్తున్నాను కాని .. ప్రజలు పడుతున్న ఇబ్బందులు .. వారు చేస్తున్న త్యాగాలు చూస్తుంటే .. ఏమీ చేయలేకపొతున్నామే అని చాలా బాదేస్తుంది.

హైదరాబాద్ 10 సంవత్సరాలు కామన్ కాపిటల్ విత్ రెవిన్యూ షేరింగ్ మంచి ఆప్షన్.

ఉద్యమం ప్రజలు చేస్తుంటే, విభజనకు ప్రధాన కారకులైన కాంగ్రెస్ & తెలుగుదేశం పార్టీలకు చెందిన నాయకులు వచ్చి, తమ జెండాలతో మళ్ళీ రాజకీయం చేస్తుంటే, సమైక్యాంధ్ర ఉద్యమంను హేళన చేయక, బయట ప్రజలు నమ్ముతారా?

ప్రజలు ఇబ్బందులు పడండి. నాయకులం మేము లబ్ది పొందుతాం అనుకునే లుచ్చా వెధవలు తప్పితే, సంధి కుదిర్చే వాళ్ళే లేరు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.