రాష్ట్ర విభజన పరిస్థితులకు రెండు పరిష్కారాలు

గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాన ప్రాంతం అల్లాడిపోతూ వుంది…
ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతం అల్లాడిపోతుంది…
కేంద్రం తన మాట ఏ మాత్రం వెనక్కి తీసుకున్నా తెలంగాన ప్రాంతంలో అలజడులు ఖాయం…

రాష్ట్ర విభజన పరిస్థితులకు రెండు పరిష్కారాలు వున్నాయి.దురదృష్టవశాత్తు, ఆ రెండు పరిష్కారాలు ‘లుచ్చా’ నాయకుల చేతుల్లోనే వున్నాయి. ఏదీ సాధ్యం కాదు.

పరిష్కారం లేని చాలా సున్నితమైన రాష్ట్ర విభజనలో, కేంద్రం సీమాంధ్రులకు ఎదో అన్యాయం చేస్తుందని విమర్శలు చేస్తున్నారు. కాని, కేంద్రం ఇద్దరికీ అమోదమైన ఫినిషింగ్ టచ్ ఇస్తుందనే ఆశీస్తున్నాను.

పరిష్కారం 1:

 • అభివృద్ది చెందిన హైదరాబాద్ తో కూడిన తెలంగాన రాష్ట్రం ఏర్పాటు చెయ్యడం అసాధ్యం అని మా అందరికీ తెలుసు.
 • ప్రజలను వెర్రిపప్పలను చేసి రాజకీయలు చేద్దాం అని మేము అంటే ‘లుచ్చా నాయకులం’, ఒకరినొకరు పోటీపడి మేము తెచ్చేస్తాం అనో మాకు అభ్యంతరం లేదనో ఎన్నికల వాగ్దానాలు చేసాం.
 • ఇలా ప్రాంతం అడ్డుపెట్టుకొని రాజకీయాలు చెయ్యడం ఎంత తప్పో తెలుసుకున్నాం.
 • మేము చేసిన ఇంత ఘొరమైన తప్పుకు, రాష్ట్రం అటుపక్కో ఇటుపక్కో కుడిసిపోతుంది. అభివృద్ది చెంద వలసిన టైంలో వెనుకబడిపోతున్నాం.
 • మేము చేసిన తప్పులకు శిక్షగా మేము & మా ఫ్యామిలీ మొత్తం రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాం. కొత్త నాయకులకు అవకాశం కల్పిస్తున్నాం.
 • కొత్త నాయకులు తప్పుడు వాగ్దానాలు చేయడానికి పోటీ పడకుండా, అభివృద్ది కోసం పొటీపడతారని ఆశీస్తున్నాం.

పరిష్కారం 2:

 • మేము ఎంతో నిజాయితీగా తెలంగాన కోసం నిజంగానే పొరాడుతున్నాం.
 • మేము నిజంగా తెలాంగాన ఏర్పాటుకు అంగీకారమే.
 • సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టడం ఆపేస్తాం.
 • కేంద్రంతో చర్చలు జరిపి, ఇరు ప్రాంతాలకు లాభనష్టాలు సమానంగా పంచుతాం.
 • అన్ని సమస్యలకు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కాకుండా చర్చలతో పరిష్కారం చేసుకుంటాం.
ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.