కేంద్రాన్ని విమర్శించడం అతితెలివి

సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించడానికి ఒక్క నాయకుడు కూడా ముందుకు రావడం లేదు. కారణాలు అనేకం. నేను గమనించినవి

  1.  కాంగ్రెస్ or తెలుగుదేశం జెండాలు పెట్టుకొని ‘సమైక్యాంధ్ర’ అనడం. దీనికంటే దిక్కుమాలిన చర్య మరేదైనా వుంటుందా?
  2.  ఎవరో ఒకరిని బలి చేద్దామనో లేక ప్రత్యర్ది పార్టీలకు చెందిన నాయకులను విమర్శిద్దామనో తప్ప,”అవును .. మేము తప్పు చేసాం ..” అని నిజాయితీగా ఒప్పుకునే ధైర్యం ఒక్కడికి కూడా లేదు .. అందరూ దొంగలే
  3.  తెలంగానకు మేము అడ్డుకాదు అంటే మేము అడ్డుకాదు అని పొటిపడిన వాళ్ళు.. ఇప్పుడు కేంద్రాన్ని విమర్శిస్తూ అతి తెలివి ప్రదర్శించడం
  4. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా నిజాయితీని ప్రదర్శించే నాయకుడు ఒక్కడు కూడా లేకపొవడం

ఈ ఎపిసోడ్ లో కేంద్రం తప్పు అసలు లేదు:

  1. 2009లోనే క్లియర్ గా సిగ్నల్ ఇచ్చింది ..
  2. మోసపూరిత చెత్త రాజకీయాలకు అలవాటు పడిన మన చెత్త రాజకీయనాయకులు కేంద్రం కూడా మన కోవకు చెందిందే అని తప్పు అంచనా వెయ్యడమే కాదు .. తొందరగా మీ నిర్ణయం చెప్పండని ఒత్తిడి తెచ్చారు .. దూల తీరింది

ఇప్పుడు ఏమీ చెయ్యాలి?
ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నారు .. ఇప్పటికైనా వారిని రైట్ డైరక్షన్ లో కరెక్ట్ హక్కుల కోసం నినాదాలు చేసేలా చెయ్యాలి

విడిపోతాం మెర్రో .. మమ్మల్ని మీతో సంబంధం లేకుండా మా మానాన మమ్మల్ని బ్రతకనివ్వండి మొర్రో అంటుంటే .. మీరు మాతోని చచ్చినట్టు కలిసుండాలి అనడం చాలా కామెడీగా వుంది ..

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.