స్పష్టత అవసరం

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారా?

విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించాలని పోరాడుతున్నారా?

కాంగ్రెస్ & తెలుగుదేశం జెండాలు పట్టుకొని రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడే అర్హత ఎవరికీ లేదు. ఆ పార్టీలు విభజనకు అనుకూలమైన పార్టీలు. Its too late to say we don’t need రాష్ట్ర విభజన.

విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించాలని పోరాడటానికి ఇంకా చాలా టైం వుంది. ఎందుకంటే కేంద్రం హైదరాబాద్ పై తన నిర్ణయాన్ని పూర్తిగా చెప్పలేదు. మీ నిర్ణయం మాకు నచ్చలేదు అని తెలంగాన ప్రజలు కూడా అందోళనలు చేపట్టే అవకాశం వుంది.

సీమాంధ్రులు తమ రూట్ మార్చాలి. సమన్యాయం కోసం పొరాడాలి. వారణాసి ప్రమోద్   ఎవరో కాని బాగా చెప్పారు

నోటి ముందరి ముద్ద లాగేసుకుంటే ఎవరికైనా కోసం వస్తుంది. వచ్చిన తెలంగాణను లాగేసుకున్నామనే భావన వారిలో ఉండటం సహజం. ఇప్పుడు కూడా లాగేసుకొని ప్రేమగా ఉండమంటే ఎన్నటికీ ఉండలేరు. బలవంతపు ప్రేమ బలపడదు. సరికదా తాత్కాలికంగా అశక్తతతో తలవంచుకున్నా ద్వేషాన్ని పెంచుతుంది. ఇదెవరికీ మంచిది కాదు. కాబట్టి ఆవేశాల్లో పడి ఆలోచన లేకుండా, విజ్ఞత కోల్పోకుండా, మనల్ని మనం మోసం చేసుకోకుండా ఐదుకోట్ల మం ది సీమాం«ద్రులకు ఏది మేలో అది అడుగుదాం. అంతేగానీ ఆత్మవంచనతో అర్థంపర్థంలేని డిమాండ్లు చేయటం ఎవరికీ మంచిది కాదు.
వారణాసి ప్రమోద్

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.