ఆగష్టు 30న రిలీజ్

ysr-naidu

మహేష్ బాబు ‘1’ ఎంత షూటింగ్ కంప్లీట్ అయ్యిందో తెలియదు కాని, జనవరి 10 రిలీజ్ అని డేట్ ఎనౌన్స్ చేసారు. షూటింగ్ అంతా ఫినిష్ చేసుకొని సెన్సార్ కూడా అయిపొయిన పవన్‌కళ్యాణ్ “అత్తారింటికి దారేది” రిలీజ్ డేట్ ఎప్పుడనేది మాత్రం ఆ దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు.

  1. సీమాంధ్ర ప్రజలు తెలంగాన ఏర్పాటుకు ఒప్పుకొని, అన్నదమ్ముల్లా విడిపొయినట్టు
  2. హైదరాబాద్ మీరే తీసుకొండి అంటే మీరే తీసుకొండి అని ఇరు ప్రాంతల వారూ త్యాగాలు చేయడం వలన, ఇద్దరి త్యాగాలను కాదనలేక హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా మిగిలినట్టు
  3. “అత్తారింటికి దారేది” ఆగష్టు 30న రిలీజ్ అని అని కొత్త ట్రైలర్ వచ్చినట్టు

కల వచ్చింది. మొత్తం కల కాదు కాని, మన సినిమా రిలీజ్ డేట్ కల నిజమైతే బావుండును.

నిజం:
నాలుగేళ్ళలో రెండు సార్లు రాష్ట్ర విభజనకు అనుకూలంగా ప్రకటనలు వెలువడ్డాక… ఇప్పుడు కొంత మంది సీమాంధ్రులు “రామాయణమంతా విని రామునికి సీత ఏమవుతుంది?” అన్న చందంగా – “ఇప్పుడు రాష్ట్రాన్ని విభజించవలసినంత అవసరం ఏమి వచ్చింది?” అని అడుగుతుండటంతో కథ ఇప్పుడే మొదలయినట్టు వుంది. శుభం కార్డ్ ఎప్పుడనేది ఎవరికీ తెలియదు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, Pawan Kalyan. Bookmark the permalink.