రియాల్టీ మాట్లాడుతున్న చిరంజీవి – నచ్చకపొతే మీ ఖర్మ!

సీమాంధ్ర నాయకులకు కానీ, సీమాంధ్ర ప్రజలకు కానీ రెండు ఆప్షన్స్ వున్నాయి.

1) సమైక్యాంధ్ర కోసం పొరాడటం
2) విభజనకు అంగీకరించి యాభై యేడేళ్ళ రాజధాని ‘హైదరాబాద్‌పై’ సమాన హక్కులు మరియు ఇతర సమస్యల పరిష్కారం కోసం పొరాటం చెయ్యడం

ఇంత దాకా మౌనంగా వుండి సమైక్యాంధ్ర అనడం నీచమైన చర్య అని అభిప్రాయం. కాబట్టి, చిరంజీవి ఫస్ట్ ప్రిఫరెన్స్ రెండో ఆప్షన్‌కే.

తెలుగువాళ్ళం విడిపొతున్నాం అనే బాద అయితే వుంది. చిరంజీవి మనసు కలిసుండాలనే కోరుకుంటుంది. కాకపొతే తెలంగాన ప్రజల ఆకాంక్షను గౌరవించ వలసిన బాద్యత వుంది. మరోసారి మోసం చెయ్యడం దారుణం.

‘హైదరాబాద్‌పై’ కేంద్రం ఏమి నిర్ణయిస్తుందో వేచి చూద్దాం. న్యాయం అనిపించకపొతే పొరాడవచ్చు. తెలంగాన ప్రజలకు ‘హైదరాబాద్‌పై’ కేంద్ర నిర్ణయం నచ్చక, వారు కూడా సమైక్యాంధ్ర అంటారేమో.

2009లో చిరంజీవి సమైక్యాంధ్ర కోసం పొరాటం చేసి పెద్ద బఫూన్ అయ్యాడని భయమేమో. ఇప్పుడు ధైర్యంగా సమైక్యాంధ్ర కోసం పొరాటం చేసే నాయకుడు ఒక్కడు కూడా లేడు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా వున్న కాంగ్రెస్‌తోనో తెలుగుదేశంతోనే వుండి, సమైక్యాంధ్ర డ్రామాలు ఆడుతున్నారు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.