ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్న చంద్రబాబుకు కాంగ్రెస్ గట్టి సమాధానం

రాష్ట్ర విభజన చేస్తుంది కాంగ్రెస్ అయినా, విభజనపై ఒత్తిడి తెచ్చింది చంద్రబాబే.

ఇప్పుడు దాకా, లేఖకు కట్టుబడి వున్నాం, విభజన ప్రక్రియ మొదలుపెట్టండి అని ఒత్తిడి తెచ్చి, కాంగ్రెస్ మొదలు అనగానే ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ విమర్శిస్తున్నారు?

1) ధైర్యంగా విభజనకు అంగీకరించండి

లేదా

2) తప్పు చేసామని ప్రజలకు క్షమాపణలు చెప్పి, రాజకీయలనుంచి విరమించండి

ఒకరిని విమర్శించే హక్కు అర్హత ఏ ఒక్క సీమాంధ్ర నాయకుడికీ లేదు

ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్న చంద్రబాబుకు కాంగ్రెస్ రాష్ట్ర విభజనపై ముందుకు పోతూ గట్టి సమాధానం చెపుతుంది.

తెలంగాన నాయకులు విభజన కోరుకున్నారు. సీమాంధ్ర నాయకులు విభజనకు అంగీకరించారు. ఇప్పుడు నాలుక అడ్డగోలుగా తిప్పి మాట్లాడితే సరిపోదు.

ఏ ప్రాంత విద్వేషాలు వద్దు అని ఉద్యమిస్తున్నారో, అదే ప్రాంతం పేరుతో సోనియా గాంధీని విమర్శిస్తున్న, సీమాంధ్ర మేధావుల్లారా .. మీరు పనిమాలిన మేధావులు అని తెలుసుకోండి.

నాలెడ్జ్ కలిగివుండటం మేధావితనం అవ్వోచ్చు .. ఆ మేధావితానికి మీ తెలివితేటలు ఉపయోగించి ఎవరి మొప్పో పొందాలని చూస్తే మాత్రం మీది పనిమాలిన మేధావితనమే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.