పరుచూరి అశోక్ బాబు .. doing good job

I am supporting central congress.
నా దృష్టిలో తప్పు మన ఇరు ప్రాంతల రాజకీయ నాయకులది తప్ప, సెంట్రల్ కాంగ్రెస్ తప్పు అసలు లేదు.
నేను ఏది నిజం అనుకుంటున్నానో అదే చెపుతున్నాను. మీరు నాతో ఏకీభవించ అవసరం లేదు.

ఒక ప్రాంతం ప్రజలు విడిపొతాం అంటున్నారు.
ప్రజల మనస్సుల్లో అబద్దాలను నర నరాన ఎక్కించేసారు మన లుచ్చా రాజకీయ నాయకులు.
ఇది రాజకీయమే, ఇక్కడ దాకా ఎప్పుడు రావాలే అని అబద్ధాలను ఖండించే నాధుడే లేకుండా పొయాడు.
సెంట్రల్ కాంగ్రెస్ పుణ్యమా అని, మన వాయిస్ కూడా వినిపించే అవకాశం వచ్చింది.
అభివృద్ది చెందిన హైదరాబాద్ మీ ప్రాంతంలో వుంది కాబట్టి, మీరు అలా అనడం సబబు కాదని వారికి నిజాలు చెప్పాలి.
ప్రాంతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్న నాయకులను అభివృద్దిపై నిలదీసే విధంగా చైతన్యం తీసుకు రావాలి.
మీరు విడిపొతాం అంటున్నారు కాబట్టి, వారు చేయవలసిన త్యాగాలను వారికి చెప్పాలి.

కెసీఆర్ బాష నీచమైనదని విమర్శిస్తూ, అంతకంటే హీనమైన బాషను ఉపయోగించడం కరెక్ట్ కాదు.

ప్రాంతం పేరుతో విద్వేషాలు పెంచుకొవడం తప్పని ఉద్యమం చేస్తూ, ప్రాంతం పేరుతో సోనియా గాంధీని తిట్టడం కరెక్ట్ కాదు.

తెలంగాన ఉద్యమం అలా జరిగింది కాబట్టి, మేము కూడా అలానే చేస్తాం అంటే కుదరదు.

సమైక్య ఉద్యమం అంటే .. “మనుషుల మధ్య విభేధాలు లేకుండా కలిసుందాం అని”

ఎంతో శాంతియుతంగా పవిత్రంగా చేయవలసిన ఉద్యమం.

ఈ కోణంలో ఆలోచిస్తే పరుచూరి అశోక్ బాబు .. doing very good job.

మైండ్ చేంజ్ అయ్యో,
రాజకీయ నాయకుల ఒత్తిడితోనో,
ఈయన కూడా స్వరం మారిస్తే,
నా చేతిలో(నా బ్లాగులో) చచ్చాడే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.