రాష్ట్రం విడిపోతుందన్న బాద నిజంగా ఎవడికి లేదు

యాభై ఏడేళ్ళు కలిసున్న తెలుగు వాళ్ళు విడిపోతున్నారు.

రాష్ట్రం విడిపోతుందన్న బాద నిజంగా ఎవడికి లేదనడానికి నేను గమనించిన నిదర్శనాలు:

1) నేను: ఆ జాతి .. ఈ జాతి .. తొక్క తోటకూర .. నాకు అసలు వుండవు. కాని మనిషి, తన హక్కులను కొల్పోకూడదు అని నమ్ముతాను.

అది కొల్పోతున్నాం అని బాదగా వుంది. జై సమైక్యాంధ్ర లేదా జై తెలంగాన అని అనమని బలవంత పెట్టడం చాలా బాదగా వుంది. జై సమైక్యాంధ్ర అని తెలంగానలో తిరగలేని పరిస్థితి. జై తెలంగాన అని సీమాంధ్రలో తిరగలేని పరిస్థితులు ఇప్పుడు వున్నాయి. ఈ పరిస్థితి మరింత ముదురు తుందెమో నని బెంగగా వుంది.

కలిసుండాలని అందరికీ వుండాలి. చదువు చెప్పాల్సిన మేధావులే ప్రజల మధ్య చిచ్చు పెడుతుంటే, మనకెందుకొచ్చిన బాద. మోస పూరిత ఉద్దేశంతో కలిసుందాం అనడం ఇంకా పెద్ద తప్పు.

ప్రతిరోజు లుచ్చా వెధవ పెంట నాయకులతో తిట్టించుకొవడం కంటే, విడిపొవడం & వచ్చే సమస్యలను పరిష్కారించుకొవడం బెటర్.

2) నేను గమనించిన కొందరు చిరంజీవి ఫ్యాన్స్ బాద:

రాష్ట్రం విడిపొతుందేమోనన్న బాద పక్కన పెట్టి, చిరంజీవి బయటకు రాలేదు, చిరంజీవి తన ఉనికిని కొల్పోతున్నాడు అని కొందరు చిరంజీవి ఫ్యాన్స్ బాద పడుతున్నారు.

మనం చేసుకున్న పాపం అటువంటిది. దేవుడు కూడా ఆపలేడు అని అంటుంటే, చిరంజీవి ఆపగలడా? .. హిరో అవ్వడానికి డ్రామాలు ఆడనందుకు చిరంజీవి అభిమానిగా నేను గర్విస్తున్నాను.

3) కాంగ్రెస్ & తెలుగుదేశం సపోర్ట్‌ర్స్

బండ బూతులు వస్తున్నాయి. ఈ &%$*!$$@ లను ఏమి అనాలో తెలియడం లేదు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ రోల్ మేజర్ అయినా, తెలుగుదేశం కూడా అంతే రెస్పాన్స్‌బుల్. సిగ్గులేని జన్మలు. కాంగ్రెస్ & తెలుగుదేశం జెండాలు పట్టుకొని, ఈ &%$*!$$@లు సమైక్యాంధ్ర అని ఎలా అంటున్నారొ అర్దం కావడం లేదు.

&%$*!$$@లకు రాష్ట్ర విభజన కంటే తమ పార్టీలే ముఖ్యం.

4) వైయస్సార్‌సిపి:
దురదృష్టం ఏమిటంటే
రాజకీయలలో
మాటలతో కాని, బలంతో కాని ఎంత మోసం చేయగల్గిదే అంత పెద్ద నాయకుడు & అంత సమర్దవంత మైన నాయకుడు.

చంద్రబాబు తోటి నాయకులను మోసం చేసాడు కాని, ప్రజలను ఎక్కువ మోసం చేయ్యలేదు. ఈ వైయస్సార్‌సిపి నాయకులందరూ అవకాశ వాదులే. ఒక్క నాయకుడు కూడా సరైనోడు కనిపించడం లేదు. అంతా డ్రామా నాయకులే. ప్రజల దృష్టిలో వాళ్ళే హిరోలు ఎందుకంటే కాంగ్రెస్ & తెలుగుదేశం పార్టీలు ఇంకా అద్వానంగా కనిపిస్తున్నాయి కాబట్టి..

bottomline:
రాష్ట్రం విడిపోతుందన్న బాద నిజంగా ఎవడికి లేదు.. కాని నిజాన్ని నిర్భయంగా చెప్పలేక సమైక్యాంధ్ర అని నాటకాలు ఆడుతున్నారు. ఈ సమస్యను అడ్డుపెట్టుకొనొ హిరోలు అవుదామని చూసే వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.