శాశ్వత పరిష్కారం వైపే కేంద్రం దృష్టి అన్నమాట నిజం

ప్రజలు నిస్సాహాయులు .. ప్రజల్లో నేనొకడిని .. నేను నా ఆవేదనను ఇలా బ్లాగులో పోస్ట్ చేసుకొని చల్లార్చుకుంటూ వుంటాను .. నేను నిజం మాట్లాడతా .. అడ్డుగోలు అనిపించవచ్చు. ఎందుకంటే అది నిజం కాబట్టి.

ఇటువంటి పరిస్థితులలో ఇక్కడ కూడా నిజం మాట్లాడకపోతే మనిషిగా పుట్టి వేస్ట్ ..

అభివృద్ది చెందిన హైదరాబాద్ తమ ప్రాంతంలో పెట్టుకొని ప్రత్యేక రాష్ట్రం అనే డిమాండ్ తప్పు.

ఒక్క లుచ్చా సీమాంధ్ర నాయకుడు కూడా ఖండించలేదు ..

సీమాంధ్రుల ప్రజల్లో సీమాంధ్ర నాయకులు ఎక్కించిన కుల పిచ్చి వలనో,
నాయకులు అలవాటి చేసిన డబ్బో తీసుకుని
ఆ లుచ్ఛా నాయకులకే మన లాంటి నిస్సాహాయులు గెలిపించారు.

ఇండైరక్ట్‌గా తెలంగానకు ఒప్పుకున్నాం.

ఆలాంటి మనకు ఇప్పుడు రాష్ట్ర విభజనను వ్యతిరేకించే అర్హత ఎక్కడిది?

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇమ్మని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి,
తన దృష్టిలో న్యాయం అనిపిస్తున్నది కేంద్రం చేస్తుంటే కేంద్రాన్ని విమర్శించడం ఎంత వరకు కరెక్ట్?

విభజన వలన మనకు జరిగే నష్టాలను చెప్పుకోకుండా,
వాటి పరిష్కారానికి మార్గాలు అన్వేషించకుండా,
ఇంకా సమైక్యాంధ్ర అనటం ఎంత వరకు కరెక్ట్?

“హైదారాబాద్ మాకు కూడా చెందినది .. మాది కాకుండా చెయ్యడానికి మేము ఒప్పుకోం .. ” అని పొరాడే నాయకుడుకు సపోర్ట్ చెయ్యలని వుంది .. ఒక్కడు కూడా లేడు .. అందరూ సమైక్యాంధ్ర అని మోసపూరిత ఉద్యమ నాయకులే ..

వాళ్ళను మోసం చేద్దామని మనం ఏమి నష్టపోతున్నామో మన నాయకులకు తెలియడం లేదు ..

కేవలం పదేళ్ళు మాత్రమే ఉమ్మడి రాజధాని, ఆ తర్వాత మీది కాదు .. అని అంటున్న కేంద్రం తీర్పును గట్టిగా వాదించే నాయకుడే లేని ప్రాంతం సీమాంధ్ర .. సిగ్గు చేటు.

ఇదే సంధర్భంగా
తెలంగాన వచ్చేస్తే ఓవర్‌నైట్ ఎదో అయిపొతామనో, మున్ముందు ఎదో అయిపొతామనో అనుకుంటున్న పిచ్చి తోటి నిస్సాహాయ ప్రజలకు సానుభూతి ..

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.