కేసీఆర్ vs మీడియా – గెలుపెవరిది?

రాజకీయం అంటే అగ్రం కులం & సొంత మీడియా- ఇది ఆంద్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం. కులాధిపత్యం పీక్ చేరుకుంటున్న తరుణంలో ప్రాంతం అనే మరో కార్డ్ తీసి సొంత రాష్ట్రం సాధించడమే కాదు, దళితుడే మొదటి మఖ్యమంత్రి అని చెప్పిన కేసీఆర్ .. ఆ వూసే లేకుండా ముఖ్యమంత్రి అయ్యి .. తెలంగాణ ప్రత్యక రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్య కారణమైన మీడియానే తెలంగాన రాష్ట్రం వెలివేసి మిడియా దూల తీర్చేస్తున్నాడు. ఒక రోజు కాకపొతే, ఒక వారం, ఒక నెల తర్వాత క్షమిస్తాడానుకుంటే, నా డిక్షనరీలో క్షమాపణకు  చోటే లేదండున్నాడు కేసీఆర్. ఇక్కడ కూడా   మిడియా  ఆంధ్ర నాయకులను ఎంత తక్కువ చేసినా తప్పు లేదు,  మా తెలంగాన నాయకులను ఏమైనా అంటే తెలంగాన ప్రజలను అన్నట్టే అంటూ ప్రజల నుంచి  భలే  సపోర్ట్ సంపాదించుకుంటున్నాడు.

తప్పు వాళ్ళ సైడు వుండటంతో ఎంతో ఓర్పుతో వున్న మీడియా, ఎదురు దాడికి సిద్దమయినట్టు కనిపిస్తుంది. 

 

తప్పులనే ఒప్పులుగా చూపించుకుంటు విర్ర వీగుతున్న ఈ కలియుగంలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

 

 

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in a2z. Bookmark the permalink.