ఎలా వుంది?
ప్రభజనం .. తెలుగు ప్రభజనం .. అమెరికాలో తెలుగు ప్రభజనం సృష్టించిన తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునే సినిమా మాత్రమే. “ఇది మా తెలుగుసినిమా తప్పకుండా చూడండి” అని వేరే బాషల వారికి చెప్పుకునే రీతిలో అయితే మాత్రం లేదు. ఎక్సపెటేషన్స్ & హైప్ నెలబెట్టుకొలేక పొయినా, లక్కీగా “ఫ్లాప్ .. చూడనవసరం ఏమీ లేదు” అని మాత్రం ఎవరూ అనలేరు.
ఒకసారి చూడొచ్చా?
రాజమౌళి కోసం ఒకసారి చూడవచ్చు. సినిమా చూసిన వాళ్ల దగ్గర పూర్తి వివరాలు కనుక్కొని, మనం చూసేది సగం సినిమా మాత్రమే అని తెలుసుకొని చూడటం మంచిది.
హైలట్స్:
- సినిమాలో మొదటి హైలెట్ గా నిలిచిన అంశం ఏదీ అంటే రమ్యకృష్ణ అని చెప్పాలి. ఆమె నటన మిగతా వారిని డామినేట్ చేసేసింది.
- సినిమాలో కట్టప్ప గా సత్యరాజ్ నిజంగా బాగా చేసారు.
- ఈ చిత్రం విజువల్ గా చాలా చోట్ల స్టన్నింగ్ గా ఉంది. కొన్ని చోట్ల మరీ పేలవంగా వున్నాయి.
- సెట్స్ అద్బుతంగా తీర్చి దిద్దారు. రానా విగ్రహం పెట్టే సీన్, రానా ఇంట్రడక్షన్, ప్రభాస్ ఇంట్రడక్షన్ అద్బుతంగా కుదిరాయి.
- ఐటం సాంగ్ అనవసరం అనిపించింది.
- శివలింగం లిఫ్ట్ చేసే సీను మినహా, ప్రభాస్ ప్రత్యేకత ఏమి లేకపొవడం చాలా పెద్ద మైనస్. జస్ట్ ప్రభాస్ కటౌట్ మాత్రమే వాడుకున్నట్టు వుంది.