Bahubali proves that a concept attached to a star will make the film much more bigger which Hollywood realized decades back.
For the first time a film looked bigger than its star Prabhas..
–RGV
రాంగోపాలవర్మ రాజమౌళికి అనుకూలంగా అన్నాడో, హెచ్చరించడానికి అన్నాడో తెలియదు కాని, కరెక్ట్‌గా చెప్పాడు.
రాజమౌళి పడిన కష్టానికి, వెచ్చించిన టైంకు తెలుగు ప్రేక్షకులు గౌరవిస్తూ, తమ గౌరవాన్ని కలక్షన్స్ రూపంలో చూపించారు. కాకపొతే తనకు తెలియకుండానే(తెలిసే చేసాడెమో) బాహుబలి-1 లో చాలా పెద్ద తప్పు చేసాడు. తెలుగుసినిమా నుంచి బయటకు వచ్చాక, హిరో గురించి మాట్లాడుకొవాలి. బాహుబలి విషయంలో అలా జరగడం లేదు. ఆ విషయంలో కేర్ తీసుకొని వుంటే ఓపినింగ్స్‌తో సహా రిపీట్ ఆడియన్స్ & లాంగ్ రన్ వుండేది.
- మగధీర – రాజమౌళి గురించి ఎంత మాట్లాడుకున్నా, రామ్‌చరణ్ కోసమే తీసిన సినిమా మగధీర. రామ్‌చరణ్‌ను అసలు ఇగ్నోర్ చెయ్యలేము.
- టెంపర్ – అవుట్ & అవుట్ ఎన్.టి.ఆర్ సినిమా.
హిరోను డైరక్టర్ డామినేట్ చెయ్యడానికి ప్రయత్నం చెయ్యక్కర్లేదు. ఆ అవసరం కూడా లేదు. హిరోను పెరఫార్మన్స్ పరంగా ఎంత బాగా ఎలివేట్ చేసి చూపిస్తే ఇండైరక్ట్‌గా దర్శకుడికి కూడా అంత పెద్ద పేరు వస్తుంది. రీసెంట్ ఉదాహరణ: గబ్బర్‌సింగ్. పవన్‌కల్యాణ్‌కు ఎంత పేరు వచ్చిందో దర్శకుడిగా హరీష్ శంకర్‌కు అంతే పేరు వచ్చింది.
రాజమౌళికి ప్రత్యేకంగా పేరు సంపాదించుకొవల్సిన పని లేదు కాబట్టి, బాహుబలి-1 విషయంలో తెలియక చెసిన తప్పిందగానే భావించాలి. బాహుబలి-2 లో ప్రభాస్ డామినేట్ చేసే విధంగా డిజైన్ చేస్తాడని ఆశీద్దాం.