మగధీర రికార్డ్స్‌ను దూకుడు కొట్టేసిందని మహేష్‌బాబు చెప్పుడు మాటలతో నిజం అనుకున్నాడు. ఆవేశపడి “Its official” అని కూడా ట్వీట్ చేసాడు.ట్రేడ్ పండితులు మాత్రం ఒప్పుకొలేదు. చివరికి అనుమానంగానే అత్తారింటికి దారేది క్రాస్ చేసిందని ఒప్పుకున్నారు. (నిజ నిజాలు ఏమిటో ఎవరికి తెలియదు)
బాహుబలి మాత్రం పెద్ద మార్జిన్‌తో కొత్త రికార్డ్స్ సృష్టిస్తుందని ఆ జన ప్రభంజనం చూసి ఎవరైనా ఒప్పుకొని తీరవలసిందే.
ఇప్పుడు “బాహుబలి రికార్డ్స్ ఎవరు బ్రద్దలు కొట్టగలరు?” అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
అన్ని డబ్బులు పెట్టి, ప్రస్తుతం ఏ హిరో కూడా సినిమా తీసే సాహసం చెయ్యలేరు & అంత అవసరం కూడా లేదు కాని, ఆ కలక్షన్స్ బ్రద్దలు కొట్టగల సత్తా మన హిరోలందరికీ వుంది.
మహేష్‌బాబు “శ్రీమంతుడు” కూడా పెద్ద స్టామినా కలిగిన సినిమానే, కాని జనాలు సినిమా ఆవేశం అంతా బాహుబలి మీదే చూపించేస్తున్నారు. ఒక నెల రోజుల్లోనే జనాలకు అంత ఆవేశం వచ్చి “శ్రీమంతుడు” బాహుబలిని మించి హిట్ చేస్తారా అంటే అనుమానమే. బాహుబలిని మించక పొయినా, ఆ ఊపును నిలబెట్టే విధంగా శ్రీమంతుడు వుండే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.
పూరి జగన్నాధ్ తన సొంత కథ కాకుండా, బయట రైటర్స్ సహాయం తీసుకుంటే చిరంజీవి 150వ సినిమా, మగధీర ఇమేజ్‌తో ఒక మంచి కథతో రామ్‌చరణ్ కూడా బాహుబలిని బీట్ చెయ్యడానికి ప్రయత్నం చేయవచ్చు. కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్న ఎన్.టి.ఆర్, గబ్బర్‌సింగ్-2 తో పవన్‌కల్యాణ్ & బన్నీ -బోయపాటి సినిమా కూడా ప్రయత్నం చేయవచ్చు.