సినిమాకు కథ చెప్పేవాడు (డైరక్టర్) ఎంత ముఖ్యమో, కథ కూడా అంతే ముఖ్యం. కథను ఎంచుకునేది కూడా డైరక్టరే కాబట్టి, రైటర్‌కు తగిన గుర్తింపు రావడం లేదు. అందుకనే రైటర్స్ దర్శకత్వం వైపు వచ్చేస్తున్నారు.
కథ అంటే పెద్ద పొడిచేయక్కర్లేదు. అన్నీ ఎమోషన్స్ పండే విధంగా, అర్టిస్ట్ పెరఫార్మన్స్ బయటపెట్టే కథ వుంటే చాలు. అంటువంటి కథలు వ్రాయడంలో విజేంద్ర ప్రసాద్ F/O రాజమౌళి ఒకరు.
చిరంజీవి సినిమాలు అంటే చిరంజీవి ఫైట్స్, చిరంజీవి ఎంటర్‌టైన్‌మెంట్ & చిరంజీవి డాన్సస్ .. ఇలా ఒక దాన్ని మించి ఒకటి వుండటంతో మంచి కమర్షియల్ హిట్స్ అయ్యేవి. అదే బాటలో బాలకృష్ణ సినిమాలు కూడా వుండేవి. చిరంజీవికి ప్రధాన పొటీ దారుడిగా బాలకృష్ణకు కూడా పెద్ద ఇమేజ్ వుండేది. అటువంటి సమయంలో ఇమేజ్‌కు తోడు సరైన కథ పడితే ఏమవుద్దో నిరూపించిన సినిమా “సమరసింహారెడ్డి”. ఆ సినిమాకు కథ అందించింది కూడా బాహుబలి అందించిన విజేంద్రప్రసాదే కావడం విశేషం. కమర్షియల్‌గా ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్, ఆ రోజుల్లో కనివిని విధంగా వున్నాయనే వారు.
హాట్సాఫ్ టు విజేంద్ర ప్రసాద్ !!!