మహేష్ బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీమంతుడు’. శిల్పకళావేదికలో ఆడియో లాంచ్ఈరోజే. రెగ్యులర్ గా కాకుండా కాస్త డిఫరెంట్ గా శ్రీమంతుడు ఆడియో లాంచ్ ని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఆడియోతో సినిమాపై మంచి హైప్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కుటుంబ విలువలతో పాటు మహేష్ అభిమానులు కోరుకునే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయని అంటున్నారు. మహేష్ బాబు సరసన హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరగుతున్న ఈ సినిమాని మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఆగష్టు 7న రిలీజ్ చేయనున్నారు. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో మైత్రి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనం శెట్టి, అంగన రాయ్ లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.