భారతదేశ అతిపెద్ద మోషన్ పిక్చర్ గా విడుదలైన బాహుబలి ఇప్పుడు భారతదేశ అతి పెద్ద విజయంగా నిలిచింది. రాజమౌళి బృందం సమిష్టి కృషికి నిదర్శనంగా నిలిచిన ఈ సినిమా విడుదలైన ప్రతీ చోటా, కనీ విని ఎరుగని రీతిలో కలెక్షన్లతో దుమ్మురేపుతుంది.
చిరంజీవి చెప్పినట్టు లో-ఎక్సపెటేషన్స్‌తో చూస్తే బాగా నచ్చుతుంది. హై-ఎక్సపెటేషన్స్ పెట్టుకుంటే కొద్దిగా నిరుత్సాహ పడతారు. కలక్షన్స్ మాత్రం ఎవరూ ఊహించనంత రేంజ్‌లో వస్తున్నాయి. కలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాపై, ఈ చిత్రం అందించిన అనుభూతిపై ఎందరో సెలబ్రిటీలు అంతర్జాల మాధ్యమంలో కొనియాడడం విశేషం. ఇప్పుడు ఈ జాబితాలోకి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరారు. తన అఫీషియల్ ఫేస్ బుక్ లో “ఇప్పుడే బాహుబలి చిత్రాన్ని చూసాను. రాజమౌళి, విజేందర్ ప్రసాద్, శోభు, సెంథిల్ మరియు ఇతర బృందానికి నా జోహార్లు. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ గార్లు సినిమాను మరో ఎత్తుకి చేర్చారు. రెండో భాగం గురించి ఆశగా ఎదురు చూస్తున్నా” అని తెలిపాడు.