టెక్నికల్‌గా చూసుకుంటే బాహుబలి కంటే ఈగ వంద రెట్లు నయం
ఎమోషన్‌లా చూసుకుంటే బాహుబలి కంటే మగధీర వంద రెట్లు నయం
కలక్షన్స్ పరంగా మాత్రం బాహుబలి ఆ రెండు సినిమాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. మొదటి భాగంతోనే రెండు భాగాలకు కావాల్సిన బడ్జెట్ డబ్బులు ప్రేక్షకులు ఇచ్చేసారు. ఆ కలక్షన్స్ సినిమా ఇరగదేసేసిందని వచ్చినవి అనుకుంటే పొరబాటు. OK సినిమా. కలక్షన్స్ రాజమౌళి టీం కష్టానికి ప్రేక్షకులు ఇచ్చిన గౌరవం అది.
idlebrain jeevi @idlebrainjeevi Jul 10
My friend’s mom loved #Baahubali , but sounded very optimistic when she said let’s retain tickets for part 2
ఆ గౌరవాన్ని నిలబెట్టుకొవాల్సిన బాద్యత రాజమౌళి టీం మీద వుంది. డబ్బులు & కాలం వెచ్చించి థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులకు సగం సినిమా చూపించడం నీచం, బాహుబలి-2 ఫ్రీగా చూపించాలని కొందరు సినిమా అభిమానులు అంటున్నారు. ఆ తిట్లను, రాజమౌళి టీం ప్రశంసలుగా తీసుకొవడం ఇంకా విచిత్రం.
httpv://youtu.be/u_qzHy_AwlA