‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ వంటి ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆగష్టు 7న వస్తున్నాడు.
“శ్రీమంతుడు బాహుబలిని క్రాస్ చేస్తుంది .. చెయ్యదు ..” అని ఇప్పుడే కామెంట్ చెయ్యడం కరెక్ట్ కాకపొయినా, ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి చేస్తూ వుంటారు. కంట్రోల్ చెయ్యడం కష్టం. ఒకటి మాత్రం నిజం “శ్రీమంతుడు కంటెంట్ కచ్చితంగా బాహుబలి కంటే బాగుంటుంది”.
రాజమౌళి ఒక్కడు మాత్రమే కష్టపడే దర్శకుడు కాదు, మన తెలుగు దర్శకులందరూ బాగా కష్టపడతారు. కాకపొతే, మన తెలుగుసినిమా స్టామినాను గుర్తించిన దర్శకుడు, మన తెలుసినిమాను వివిధ బాషల్లోకి ఇంతలా తీసుకెళ్ళిన మొదటి దర్శకుడిగా ఒప్పుకొవాలి.
రాజమౌళి వేసిన మార్గాన్ని మన దర్శక నిర్మాతలు ఊపయోగించుకొవాలి. తమిళ్‌తో పాటు శ్రీమంతుడు సినిమాను హిందిలో కూడా డబ్ చెయ్యాల్సింది.