లుంగీ గెటప్ కేక

image

మహేష్ బాబు చేసిన లేటెస్ట్ మూవీ ‘శ్రీమంతుడు’ సినిమా ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి అందరికీ తెల్సిందే. ఆ సినిమా కోసం మహేష్ బాబు లుంగీ గెటప్ కేక వుంది. సినిమా సినిమాకి తన పాత్రలో, కథ, కథనాల్లో కొత్తదనం ట్రై చేసే స్టార్ హీరోస్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటారు. ఈ సినిమా మేకర్స్ అయిన మైత్రి మూవీస్ వారు మహేష్ బాబుకి సంబందించిన ఓ డిఫరెంట్ లుక్ ని రోజుకొకటి రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం మహేష్ బాబు లుంగీ కట్టుకొని తమ ఫ్రెండ్స్ తో కలిసి విలేజ్ లో నడుచుకుంటూ వచ్చే స్టిల్ ని రిలీజ్ చేసింది. ఓ విలేజ్ కుర్రాడిలా వెనక తన ఫ్రెండ్స్ బ్యాచ్ తో కలిసి నడుచుకుంటూ రావడం అనే పాయింట్ అందరికీ తెగ నచ్చేసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ ఊర్లో ఇలా తిరిగే ఉంటారు. మహేష్ బాబు – శృతి హాసన్ మొదటి సారి జోడీ కట్టిన ఈ సినిమాకి కొరటాల శివ డైరెక్టర్. ‘సెల్వందన్’ పేరుతో తమిళంలో కూడా ఆగష్టు 7న రిలీజ్ కానుంది.

httpv://youtu.be/q6YKXdy-kM0

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in శ్రీమంతుడు, Featured. Bookmark the permalink.