రేటింగ్ ఎంత?
- ఏ సినిమాకైనా రేటింగ్ ఇవ్వడం కష్టం.ఏ సినిమా నైనా ఒక కోణంలో సినిమాలో ఏముంది అని తీసిపాడేయవచ్చు. ఇలా ఆలోచించే వాళ్ళు ఈ సినిమాకు దూరంగా వుంటే బెటర్.
- ఫస్ట్ స్లోగా టి.వి సిరియల్ చూస్తున్నామా అని ఫీలింగ్‌తో మొదలయ్యి, బాగా పికప్ అయ్యింది.
- సినిమా అంటే హిరో మీద నడవాలి. అలానే నడిచింది. హాట్సాఫ్ టు కొరటాల శివ.
- ఖలేజ సినిమా ద్వారా కామెడి టైమింగ్ క్యాచ్ చేసిన దగ్గర నుండి, మహేష్‌బాబుకు యాక్టింగ్ చాలా ఈజీ అయిపోయింది.
- ఫైట్స్ ఎక్కువ అనిపించినా, బాగా తీసారు. మాస్కు బాగా నచ్చుతాయి.
- ఓవరాల్‌గా ఎంటరటైన్మెంట్ తక్కువ అనిపించినా, పంచ్‌లు బాగానే పండినాయి.
- పాటలు బాగున్నాయి.
- ఎమోషన్ చాలా హైలో వుంది. నిజ జీవితంలో ఎవరూ చెయ్యలేని పని. జరిగితే బాగుండునని అనిపిస్తుంది. సినిమాలో చూసి ఆనదించడమే.
బాహుబలిని క్రాస్ చేస్తుందా?
ఎవరేజ్ సినిమాకు రాజమౌళి వ్యూహం పని చేసి అద్భుతాలు సృష్టించింది. బాహుబలి సినిమాను ఒక వ్యూహం ప్రకారం అందరూ ఓన్ చేసుకొనేలా చేసారు. చూసిన వాళ్ళు చూడొద్దు అనలేరు. అలా అని బాహుబలి ఏమి పొడిచేసే సినిమా కాదు. 90% ఎవరేజ్ అనే అంటున్నారు.
కమర్షియల్‌గా బాహుబలిలో సగం కూడా చేయకపొయినా, కంటెంట్ పరంగా బాహుబలి కంటే శ్రీమంతుడు కచ్చితంగా బాగుంది. చెప్పాలనుకున్న పాయింట్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, బాగా చెప్పారు.
జగపతి బాబు ఎలా చేసాడు?
అక్కడక్కడా కొద్దిగా కష్టం అనిపించినా, బాగానే చేసాడు. మహేష్‌బాబు డామినేషన్ వుంది కాబట్టి, కవర్ అయిపోవచ్చు.
రాజేంద్ర ప్రసాద్ ఎలా చేసాడు?
బాగానే చేసాడు.
కొరటాల శివ “మిర్చి” కంటే బాగుందా?
మిర్చిలో ఎంటరటైనమెంట్ ఎక్కువ. లాజికల్‌గా కనక్షన్స్ లూజ్‌గా వుంటాయి. శ్రీమంతుడు లాజికల్‌గా బాగా కనెక్ట్ చేసాడు కాని, ఎంటరటైనమెంట్ తక్కువ అని చెప్పవచ్చు.
చూడొచ్చా?
ఎంటరటైనమెంట్ కోసమే సినిమా అనుకుంటే, ఈ సినిమాకు దూరంగా వుండవచ్చు. నిజ జీవితం చెయ్యలేము, సినిమాలో చూసి ఆనందిద్దాం అనుకుంటే కచ్చితంగా చూడవచ్చు.
bottom line:
hats off to మహేష్‌బాబు & కొరటాల శివ.