ట్రెండ్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కోవలిసి వస్తుంది. మంచి మాస్ హిరోగా జనాల్లోకి చొచ్చుకొని పోకుండా ఇలా అవార్డ్ విన్నింగ్ మూవీస్‌లో ఎందుకు చేస్తున్నాడనే విమర్శలు “వరుణ్ తేజ్” పై వున్నాయి.
ఇటువంటి సినిమాలకు హిరో కంటే ముందుగా దర్శక-నిర్మాతలను అభినందించాలి. నిర్మాత కూడా దర్శకుడు క్రిష్ కాబట్టి, ప్రశంసలు అన్నీ ఆయనకే చెందుతాయి. ఒక డిఫరెంట్ మూవీ అందించాలన్న తపన బాగా కనిపిస్తుంది. క్రిష్‌ను సపోర్ట్ చేస్తున్న వరుణ్ తేజ్ కూడా అభినందనీయుడు.