మెగాస్టార్ మెగా అభిమానులకు ఇచ్చిన మెగాగిఫ్ట్ “రామ్‌చరణ్”.
httpv://youtu.be/yXd5wbwYQ4o
రామ్‌చరణ్ శ్రీనువైట్లల కాంబినేషన్‌లో భారీ ఎత్తున ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ స్టిల్స్, ఫస్ట్ టీజర్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్ చూశాక సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయనేది స్పష్టమవుతూనే ఉంది. చరణ్ అల్ట్రా స్టైలిష్ లుక్, రిచ్‌క్లాస్ సినిమాటోగ్రఫీ, థమన్ బ్యాక్‌గ్రౌండ్ ఈ టీజర్‌కు స్పెషల్ హైలైట్స్‌గా నిలిచాయి. ఇక మేజర్ హైలైట్‌గా యాక్షన్ ఎపిసోడ్స్‌లో రామ్ చరణ్ ఈజ్ యాక్టింగ్ గురించి చెప్పుకోవాలి. ముఖ్యంగా “వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్‌లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!” అంటూ చరణ్ చెప్పే డైలాగ్ అభిమానులకు పండగే అనడంలో అతిశయోక్తి లేదు.
డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుంది. డప్పుల థమన్ మ్యూజిక్. “నాయక్” సినిమాను మించి మ్యూజిక్ ఇచ్చి వుంటాడని మెగా అభిమానులు అనుకుంటున్నారు.