థమన్-పవన్‌కల్యాణ్-హరీష్‌శంకర్-దిల్‌రాజ్

SS Thaman
పవన్ కల్యాణ్ ఇప్పటివరకు చేసిన సినిమాలు మూడు రకాలు అనుకుంటే:

  1. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, తొలిప్రేమ, బద్రి, ఖుషి & అత్తారింటికి దారేది
  2. జాని, గుడుంబా శంకర్, బాలు, బంగారం, జల్సా , పంజా & కెమెరామెన్ గంగతో రాంబాబు
  3. గోకులంలో సీత , సుస్వాగతం , తమ్ముడు, అన్నవరం, తీన్ మార్, గబ్బర్ సింగ్ & గోపాల గోపాల

దర్శకులు మంచి స్క్రిప్ట్స్ తో పవన్ కళ్యాణ్ ను మెప్పించిన సినిమాలు మొదటిరకం. పవన్ కళ్యాణ్ తనకు కావాల్సిన మెయిన్ స్టోరి లైనుతో దర్శకుల చేత చేయించుకున్న సినిమాలు రెండోరకం. రేమేక్స్ మూడోరకం.

మొన్న ” సుబ్రమణ్యం ఫర్ సేల్” ఆడియో ఫంక్షన్‌లో దిల్‌రాజు మాట్లాడుతూ, తనకు పవన్‌కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెపుతూ, వెంటనే హరీష్‌శంకర్‌ను ఒక సబ్జక్ట్ తయారు చెయ్యమని అడిగానని చెప్పాడు. ఈ ప్రొజెక్ట్ వర్క్ అయితే థమన్-పవన్‌కల్యాణ్-హరీష్‌శంకర్-దిల్‌రాజ్ కాంబినేషన్‌లో ఒక సినిమా చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కుతుంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Pawan Kalyan. Bookmark the permalink.