సెప్టెంబర్ 1వ తేదీన ‘కంచె’ ట్రైలర్‌

kanche

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించిన ‘కంచె’ సినిమా, దర్శకుడు క్రిష్ స్వయంగా రూపొందించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణమ్ వందే జగద్గురుమ్’ ఇలా తన ప్రతీ సినిమా ద్వారా ఏదైనా బలమైన అంశాన్ని డిఫరెంట్ కథాంశానికి ముడిపెట్టి తీసే దర్శకుడు క్రిష్, కంచె కోసం రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. జిరో ఎక్సపెటేషన్స్‌తో మొదయిన ఈ సినిమా టీజర్‌తో మెగా అభిమానులకు నిజంగానే ఒక డిఫరెంట్ ఫిలిం అనే హోప్స్ వచ్చాయి. సెప్టెంబర్ 1వ తేదీన ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. చిరందన్ భట్ అందించిన సంగీతం ఈ సినిమాకు ఓ హైలైట్‌గా నిలుస్తుందని సినిమా యూనిట్ చెపుతున్నారు. ఇక సెప్టెంబర్ 2వ వారంలో ఈ సినిమా ఆడియోను విడుదల చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి నిర్మించారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కంచె. Bookmark the permalink.